Tea Benefits: టీతో కలిపి ఇవి తింటే చాలా డేంజర్..! అవేంటంటే..?

It is Very Dangerous To Eat These Foods while Drinking Tea | Healthy Food Habits
x

Tea Benefits: టీతో కలిపి ఇవి తింటే చాలా డేంజర్..! అవేంటంటే..?

Highlights

Tea Benefits: టీ ఇది లేనిదే రోజు గడవదు... సాధారణ ప్రజల అలసట తీర్చే పానీయం...

Tea Benefits: టీ ఇది లేనిదే రోజు గడవదు. సాధారణ ప్రజల అలసట తీర్చే పానీయం. దాదాపు ప్రతి ఒక్కరు టీతోనే రోజు ప్రారంభిస్తారు. కొందరైతే రోజుకు రెండు మూడు సార్లు టీ తాగుతారు. ఏ ఆఫీసులో చూసినా, ఏ అడ్డాలో చూసినా టీ ఉండాల్సిందే. అయితే ఇటీవల చాలామంది టీ తో పాటుగా స్నాక్స్‌ తీసుకుంటున్నారు. ఇష్టమొచ్చిన రీతిలో ఏదిపడితే అది తింటున్నారు. ఇది సరైన పద్దతి కాదు. కొన్ని ఆహారాలు టీ తో కలిపి తింటే విషంగా మారే అవకాశం ఉంది. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

1. మొలకెత్తిన పప్పులు

మొలకెత్తిన పప్పులు లేదా సలాడ్‌లను అల్పాహారంగా తిన్న తర్వాత ప్రజలు తరచుగా టీ తాగడం గమనించవచ్చు. అయితే ఇలా చేయడం వల్ల కడుపులోని జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. ఇలా చేయడం సరైన పద్దతి కాదు.

2. శీతల పానీయాలు

టీ తాగిన వెంటనే చల్లటి నీరు తాగడం హానికరం. అంతే కాదు టీ తాగిన తర్వాత ఐస్ క్రీం తినకూడదు. టీ తాగిన గంట తర్వాత కావాలంటే మీరు చల్లటి పదార్థాలు తినవచ్చు.

3. ఉడికించిన గుడ్డు

ఉడకబెట్టిన గుడ్లను టీతో పాటు తినకూడదని చాలా తక్కువ మందికి తెలుసు. గుడ్డు ప్రోటీన్‌కి మంచి మూలం. టీతో కలిపి తీసుకుంటే అది మీకు హానికరం. అందుకే దీనికి దూరంగా ఉండటం మంచిది.

4. పసుపు

మీకు టీ తాగడం అంటే ఇష్టమైతే పసుపు ఎక్కువగా ఉన్న ఆహారాలు తినవద్దు. పసుపు, టీ కలిస్తే రసాయన ప్రతిచర్య ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.

5. పుల్లటి పదార్థాలు

పుల్లటి పదార్థాలు టీ కలిపి తీసుకోవడం వల్ల ఎసిడిటీ వస్తుంది. మీరు స్నాక్స్ తీసుకుంటే అందులో నిమ్మకాయ లేదా పుల్లని ఆహరాలను కలిపిప తీసుకోవద్దు.

Show Full Article
Print Article
Next Story
More Stories