Health Tips: శరీరంలో ఆక్సిజన్‌ కొరత ఉందా.. డైట్‌లో ఈ పండ్లని చేర్చుకుంటే ఉపశమనం..!

Is there Lack of Oxygen in The Body Include These Fruits in the Diet
x

Health Tips:శరీరంలో ఆక్సిజన్‌ కొరత ఉందా.. డైట్‌లో ఈ పండ్లని చేర్చుకుంటే ఉపశమనం..!

Highlights

Health Tips: శరీరాన్ని దృఢంగా ఉంచడమే కాకుండా వ్యాధులతో పోరాడే శక్తిని అందిస్తుంది

Health Tips: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది అనారోగ్యానికి గురవుతున్నారు. దీనికి కారణం రోగనిరోధక శక్తి లేకపోవడమే.ఇది శరీరాన్ని దృఢంగా ఉంచడమే కాకుండా వ్యాధులతో పోరాడే శక్తిని అందిస్తుంది. దీంతోపాటు శరీరంలో ఆక్సిజన్ స్థాయిపై కూడా శ్రద్ధ వహించాలి. తద్వారా ఎలాంటి శ్వాసకోశ సమస్య ఉండదు. దీని కోసం కష్టపడాల్సిన అవసరం లేదు. ఆహారంలో కొన్ని పండ్లను చేర్చుకోవాలి. శరీరంలో ఆక్సిజన్ స్థాయిని సరిచేయడానికి ఎలాంటి పండ్లని తినాలో ఈరోజు తెలుసుకుందాం.

పియర్

రక్తంలో ఆక్సిజన్ స్థాయిని పెంచడంలో పియర్ సూపర్‌గా పనిచేస్తుంది. ఇందులో విటమిన్ సి, విటమిన్ కె, పొటాషియం, ప్రోటీన్, ఫైబర్, కాపర్ వంటి పోషకాలు ఉంటాయి. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలోని ఆక్సిజన్ స్థాయి మెరుగ్గా ఉంటుంది.

బొప్పాయి

బొప్పాయి పొట్ట ఆరోగ్యానికి పలు విధాలుగా ఉపయోగపడుతుంది. ఇందులో పొటాషియం, కార్బోహైడ్రేట్, ప్రొటీన్, విటమిన్ ఎ, బి, సి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో ఆక్సిజన్ స్థాయిని పెంచుతుంది. ఒకవేళ శరీరంలో ఆక్సిజన్ తగ్గుతున్నట్లయితే వెంటనే బొప్పాయిని తినండి. మంచి ఫలితాలు ఉంటాయి.

కివి

కివి రుచి పుల్లగా, తీపిగా ఉంటుంది. దీని వినియోగం శరీరానికి చాలా మంచిది. శరీరంలో ఆక్సిజన్‌ను పెంచే అనేక పోషకాలు ఇందులో ఉన్నాయి. దీంతోపాటు ముఖం కూడా కాంతివంతంగా తయారవుతుంది. ఇందులో సి విటమిన్‌ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. అంటువ్యాధుల నివారణికి సహాయపడుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories