Weight Lose: బెల్లీఫ్యాట్‌ కరగాలంటే పరగడుపున ఈ జ్యూస్‌ తాగండి..!

Weight Lose: ఈ రోజుల్లో చాలామంది బెల్లీఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారు.

Arun Chilukuri
Updated on: 27 Jun 2022 7:00 AM IST
If you Want to Melt Belly Fat Drink Coriander Juice on the Empty Stomach
X

Weight Lose: బెల్లీఫ్యాట్‌ కరగాలంటే పరగడుపున ఈ జ్యూస్‌ తాగండి..!

Weight Lose: ఈ రోజుల్లో చాలామంది బెల్లీఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారు. దీనిని తగ్గించుకోవడానికి జిమ్‌ల చుట్టూ తిరుగుతున్నారు. కానీ బెల్లీఫ్యాట్‌ కరగడం అనేది అంత సులువైన విషయం కాదు. కానీ పరగడుపున ఒక జ్యూస్ తాగితే సులువుగా కరుగుతుంది. ఇందులోని పదార్థాలు కొవ్వుని కరిగించడంలో బాగా పనిచేస్తాయి. ఆ జ్యూస్ గురించి తెలుసుకుందాం.

కొత్తిమీర మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా ప్రసవం తర్వాత పొట్టలో పేరుకుపోయే కొవ్వుతో చాలామంది మహిళలు ఇబ్బందులు పడుతారు. ఇలాంటి వారు కొత్తిమీర జ్యూస్‌ తాగవచ్చు. అయితే ఈ పానీయాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. వాస్తవానికి కొత్తిమీరలో ఉండే పోషకాలు మన ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి.

మన బరువును నియంత్రించడంతో పాటు పొట్ట కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. ఈ డ్రింక్ ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీని కోసం ముందుగా మీరు కొత్తిమీర, సోంపు, జీలకర్రను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఈ నీటిని మరిగించి తర్వాత దానిని ఫిల్టర్ చేసి కొద్దిగా వేడి టీ మాదిరి తాగాలి. కావాలంటే అందులో బ్లాక్ సాల్ట్, నిమ్మరసం కలుపుకోవచ్చు. ఈ డ్రింక్‌లో ఉండే కొత్తిమీర, జీలకర్ర, సోంపు పొట్ట కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story