Bathing Mistakes: జుట్టు విషయంలో ఈ పొరపాట్లు చేస్తే బట్టతల వస్తుంది..!

if you Make These Mistakes in the Case of Hair Baldness Will Come
x

Bathing Mistakes: జుట్టు విషయంలో ఈ పొరపాట్లు చేస్తే బట్టతల వస్తుంది..!

Highlights

Bathing Mistakes: మీ జుట్టు నిరంతరం రాలుతూ ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి.

Bathing Mistakes: మీ జుట్టు నిరంతరం రాలుతూ ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. జుట్టు రాలడానికి కారణం స్నానం చేసేటప్పుడు మీరు చేసే తప్పులే. వాస్తవానికి జుట్టు కుదుళ్లలో మురికి పేరుకుపోతుంది. దీని వల్ల ఇది కొత్త వెంట్రుకలు పెరగనివ్వదు. ఈ సమస్యను అధిగమించడానికి మీరు జుట్టును సరైన మార్గంలో కడగాలి. షాంపూ చేయడానికి 30 నిమిషాల ముందు జుట్టుకు నూనె రాయాలి. తరువాత జుట్టును పూర్తిగా తడి చేసి షాంపూని తలకు బాగా పట్టించి మసాజ్ చేయాలి. జుట్టు కడిగిన తర్వాత సహజ గాలిలో ఆరనివ్వాలి.

జుట్టును కడిగిన తర్వాత తడి జుట్టు మీద దువ్వడం మంచిదికాదు. ఎందుకంటే ఇది జుట్టును బలహీనపరుస్తుంది. మీరు చాలా రోజులు ఇలాగే కొనసాగిస్తే బట్టతల వచ్చే ప్రమాదం ఉంటుంది. వారానికి 2 నుంచి 3 సార్లు కంటే ఎక్కువ సార్లు జుట్టును కడగకూడదు. ప్రతిరోజు జుట్టుని కడిగితే జుట్టు పొడిగా మారుతుంది. జుట్టును కడిగిన వెంటనే నూనె రుద్దకూడదు. అది జుట్టును బలహీనపరుస్తుంది. అన్నింటిలో మొదటిది జుట్టును ఆరనివ్వాలి. మార్కెట్‌లో లభించే కండీషనర్‌కు బదులుగా కలబందను ఉపయోగిస్తే మంచిది. కలబందను వారానికి రెండు సార్లు తప్పనిసరిగా తలకు పట్టించాలి. హెయిర్ డ్రైయర్ వేడి గాలి జుట్టును బలహీనపరుస్తుంది. జుట్టు పొడిగా ఉండటానికి సహజ గాలి సరిపోతుంది. కొన్ని గంటల్లో మీ జుట్టు పూర్తిగా ఆరిపోతుంది.

మానవ జన్యువుల్లో బాల్డ్‌నెస్‌ జీన్స్‌ ఆండ్రొజెనిటిక్‌ అలోపిసియా కారణంగా బట్టతల వస్తుందని నిపుణులు చెబుతున్నారు. మనం ఎదుర్కొనే ఒత్తిళ్లు, పోషకాహార లోపం కారణంగా కూడా వెంట్రుకలు పలుచబడి బట్టతల వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక మహిళల్లో మెనోపాజ్‌, గర్భధారణం తదితర సమయాలలో హర్మోన్ల విడుదలలో వచ్చే మార్పుల వల్ల కూడా వెంట్రుకలు రాలిపోతాయి. ఇక పురుషుల్లో, మహిళల్లో గుండె వ్యాధులు, డయాబెటిస్‌, బీపీ, అర్థరైటిస్‌ వంటి వ్యాధులతో బాధపడేవారు మందులు వాడటం వల్ల జుట్టు ఊడిపోయి బట్టతల వస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories