Health Tips: 40 ఏళ్లు దాటాయంటే ఇవి కచ్చితంగా తినాలి.. లేదంటే ఈ వ్యాధుల బెడద తప్పదు..!

If You Are Over 40 Years Of Age You Should Eat These For Sure Otherwise You Will Suffer From These Diseases
x

Health Tips: 40 ఏళ్లు దాటాయంటే ఇవి కచ్చితంగా తినాలి.. లేదంటే ఈ వ్యాధుల బెడద తప్పదు..!

Highlights

Health Tips: వయసు పైబడిన కొద్దీ మనిషి బలహీనంగా మారుతూ ఉంటాడు. ఇది సహజంగా జరిగే ప్రక్రియే.

Health Tips: వయసు పైబడిన కొద్దీ మనిషి బలహీనంగా మారుతూ ఉంటాడు. ఇది సహజంగా జరిగే ప్రక్రియే. వయసుతో పాటు చర్మం, జుట్టు, ముఖం మారుతూ ఉంటాయి. వీటితో పాటు శరీరం లోపల కూడా చాలా మార్పులు జరుగుతుంటాయి. అవయవాల పనితీరు మందగిస్తుంది. రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఇలాంటి సమయంలో పోషకాహారం తీసుకోవాలి. ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన వారు కొన్ని సూపర్ ఫుడ్స్ ని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు వాటి గురించి తెలుసుకుందాం.

40 ఏళ్ల తర్వాత మహిళలు బోలు ఎముకల వ్యాధి, రొమ్ము క్యాన్సర్, రక్తహీనత, స్ట్రోక్, గుండె జబ్బులు, మధుమేహంతో బాధపడుతుంటారు. ఈ వ్యాధులన్నీ క్రమంగా శరీరాన్ని బలహీనంగా, నిర్జీవంగా మారుస్తాయి. వీటిని నివారించాలంటే మహిళలు తప్పనిసరిగా ఐరన్, క్యాల్షియం, విటమిన్ డి, ప్రొటీన్లు మొదలైనవి తీసుకోవాలి. వీటి కోసం ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో ఈ రోజు తెలుసుకుందాం.

ఆకుకూరలు

ఐరన్, విటమిన్లు, కాల్షియం, ప్రొటీన్లు పచ్చి ఆకు కూరల నుంచే లభిస్తాయి. కూరలు, చట్నీ రూపంలో వీటిని వండుకుని తినవచ్చు. ఇది మీ హిమోగ్లోబిన్, ఆర్బీసీ, డబ్ల్యూబీసీ కౌంట్ పెంచుతాయి.

గుడ్డు

40 ఏళ్ల తర్వాత ఉడకబెట్టిన గుడ్డు కచ్చితంగా తినాలి. ఈ సూపర్ ఫుడ్ లో ప్రొటీన్, విటమిన్ డి, బయోటిన్, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఉడకబెట్టిన కోడిగుడ్లను తినడం వల్ల కండరాలు తగ్గకుండా శరీరంలో బలంగా తయారువుతుంది.

పప్పు

మూంగ్ పప్పు, ఉరద్ పప్పు, చనా పప్పులో చాలా పోషకాలు దాగి ఉంటాయి. ప్రతిరోజు ఈ పప్పులతో వండిన వంటకాలను తీసుకోవాలి. ఇవి విటమిన్లు, మినరల్స్‌తో పాటు పెద్ద మొత్తంలో ఫైబర్‌ను శరీరానికి అందిస్తాయి. దీనివల్ల మలబద్దక సమస్యను నివారించవచ్చు.

పెరుగు, మజ్జిగ

సరైన జీర్ణక్రియను నిర్వహించడానికి ప్రతిరోజు పెరుగు, మజ్జిగ తీసుకోవాలి. వీటిలో కాల్షియంతో పాటు ప్రో-బయోటిక్స్ ఉంటాయి . ఇది జీర్ణక్రియకు అవసరమైన బ్యాక్టీరియా సంఖ్యను అందిస్తుంది. దీంతో జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది.

యాంటీఆక్సిడెంట్లు ఆహారం

డార్క్ చాక్లెట్, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు మొదలైనవి యాంటీఆక్సిడెంట్లను అందించే కొన్ని ఆహారాలు. ఇది రొమ్ము క్యాన్సర్‌కు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తుంది. వీటిని తరచుగా తీసుకుంటూ ఉండాలి. ఈ డైట్ మెయింటెన్ చేస్తే కచ్చితంగా 40 ఏళ్ల తర్వాత కూడా హ్యాపీగా జీవించవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories