Happy Life: జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

Happy Life: జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..
x

Happy Life: జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

Highlights

ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు. మరి లైఫ్‌ను పూర్తిగా ఎంజాయ్ చేయాలంటే ఏం చేయాలి?

Happy Life: ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు. మరి లైఫ్‌ను పూర్తిగా ఎంజాయ్ చేయాలంటే ఏం చేయాలి?

జీవితాన్ని ఆస్వాదించాలంటే ముందు జీవితం వేగం తగ్గించాలి. హడావుడిగా చేసే పనితో మీకు శ్రమ అధికమవుతుంది తప్ప సంతోషం కనిపించదు. వంద పనులు ఒకేసారి చేసేబదులు ఏదో ఒక పనిని వందశాతం నిబద్ధతతో చేస్తే ఆనందం లభిస్తుంది. ఇష్టంగా ఆస్వాదిస్తూ చేసే పని మాత్రమే మీకు ఆనందాన్ని కలిగిస్తుంది.

లైఫ్‌ని ఫుల్‌గా ఎక్స్‌పీరియెన్స్ చేయాలంటే గతాన్ని, భవిష్యత్తును తలుచుకుని బాధపడటం మానుకోవాలి. మన చేతుల్లో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకునే మార్గం ఆలోచించాలి.

విలాసవంతమైన జీవితం గడపాలంటే డబ్బు అవసరమే. కానీ సంతోషంగా ఉండటానికి అవసరంలేదు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడిపిన కొద్ది క్షణాలే మనకు జీవితాంతం గుర్తుండిపోతాయి. కాబట్టి మీ ప్రాధాన్యతలను మార్చుకోవాలి.

మీ గురించి ఇతరులు ఏం అనుకుంటారో అని ఆలోచిస్తున్నంత కాలం జీవితంలో ఆనందం అనేది ఉండదు. కాబట్టి మనసులో ఒకటి పెట్టుకొని బయటకు మరోలా ఉండడం మానుకోవాలి. మీకు నచ్చినట్టుగా మీరు ఉండడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే జీవితం బాగుంటుంది. అలాగే మిమ్మల్ని ఇతరులతో పోల్చుకోవడం మానేయండి. పోల్చుకోవడం వల్ల అసూయ ఏర్పడుతుంది. వారి దగ్గర ఉన్నది మీకు లేదన్న బాధ కలుగుతుంది. ఉన్న సంతోషం మాయమవుతుంది.

వీటితోపాటు తినే ఆహారం, నివసించే ప్రదేసం, రోజూ కలిసే వ్యక్తుల మీద కూడా శ్రద్ధ వహించాలి. చేసే ప్రతి పని మీద పూర్తి ధ్యాస ఉంచాలి. ఇలా చేస్తే లైఫ్‌లో కొత్త డైమెన్షన్ ఓపెన్ అవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories