ముఖానికి మొటిమలు వస్తే ఏం చేయాలి?

ముఖానికి మొటిమలు వస్తే ఏం చేయాలి?
x
Highlights

మగువలు అందంగా కనబడాలంటే మొదటి స్థానం ముఖానికే అని చెప్పాలి. కొంతమంది ముఖం చూస్తే నున్నగా, మృదువుగా ఉంటుంది. మరికొంత మందిని చూస్తే ముఖం అంతా మొటిమలతో...

మగువలు అందంగా కనబడాలంటే మొదటి స్థానం ముఖానికే అని చెప్పాలి. కొంతమంది ముఖం చూస్తే నున్నగా, మృదువుగా ఉంటుంది. మరికొంత మందిని చూస్తే ముఖం అంతా మొటిమలతో నిండిపోయింటుంది. ఈ మొటిమలు కారణంగా చాల మంది అమ్మాయిలు బాధ పడుతూ ఉంటారు. మరి ఈ మొటిమలు మటుమాయం అవ్వటానికి చాల మంది రోజంతా ముఖం కడుక్కోంటూ ఉంటారు. ఇలా చేయటం వలన మొటిమలు తగ్గుతాయని అభిప్రాయ పడుతుంటారు. రోజంతా ముఖం కడుక్కోవడం వలన మొటిమలు ఏ మాత్రం తగ్గవు. మరి మొటిమలు వస్తే ఏం చేయాలి? తెలుసుకుందాం..

* మొటిమల సమస్యలు ఉన్నవారు స్క్రబ్‌ చేయకండి. ఎందుకంటే స్క్రబ్బింగ్‌ వల్ల చర్మ సమస్యలు మరింత ఎక్కువవుతాయి. కాబట్టి మొటిమలతో బాధపడే వారు స్క్రబ్బింగ్‌కు దూరంగా ఉండటం చాల ఉత్తమం

* ముఖం అతిగా కడగడం లాంటివి చేస్తే చర్మంలోని సహజ నూనెలు తగ్గి సమస్య మరింత ఎక్కువ అవుతుంది. ఇలా చేయడం వల్ల ముఖంలోని సహజ తేమ తగ్గి నూనె ఉత్పత్తి పెరుగుతుంది.

* జంక్‌ఫుడ్‌ అధికంగా తీసుకోవడం, నిద్రలేమి, ఒత్తిడి కారణంగా కూడా మొటిమల సమస్య తీవ్రంగా ఉంటుంది. తాజా పండ్లు, కూరగాయలు తీసుకొని, నీటిని ఎక్కువగా తాగుతుంటే మొటిమల సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories