షడ్రుచుల సమ్మేళనం.. మన తెలుగువారి ఉగాది పచ్చడి తయారీ ఇలా..

షడ్రుచుల సమ్మేళనం.. మన తెలుగువారి ఉగాది పచ్చడి తయారీ ఇలా..
x
Highlights

షడ్రుచుల సమ్మేళనం మన తెలుగువారి ఉగాది పచ్చడి. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు కలగలిపిన ఈ పచ్చడిని తెలుగురాష్ట్రాల్లోని ప్రతి ఒక్కరు ఉగాది రోజు తప్పక రుచి చూస్తారు.

షడ్రుచుల సమ్మేళనం మన తెలుగువారి ఉగాది పచ్చడి. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు కలగలిపిన ఈ పచ్చడిని తెలుగురాష్ట్రాల్లోని ప్రతి ఒక్కరు ఉగాది రోజు తప్పక రుచి చూస్తారు. సంవత్సరం పొడవునా...సుఖ దుఖ్ఖాలను, కష్టనష్టాలను ఎదుర్కొంటూ ముందుకు సాగాలని అనే సందేశాన్ని ఇస్తుంది ఉగాది పచ్చడి..మరి మరికొన్ని రోజుల్లో ఉగాది పండుగ రానే వస్తోంది. మరి నేటి తరానికి ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో తెలియదు..మరి షడ్రుచుల సమ్మేళనంతో పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.. పదండి.

కావాల్సిన పదార్ధాలు:

పచ్చిమామిడి

♦ వేప పువ్వు

♦ కొబ్బరి

♦ చింతపండు

♦ బెల్లం

♦ అరటిపండుద

♦ చెరకు రసం

♦ ఉప్పు

♦ నీళ్లు

తయారీ విధానం:

ముందుగా 100 గ్రాముల చింతపండు తీసుకోవాలి. అందులో కొద్దిగా నీళ్లు పోసి నానబెట్టాలి. పది నిమిషాల తరువాత రసాన్ని తీసుకుని గుజ్జును వేరుచేయాలి. ఇప్పుడు వేపప్పును తీసుకుని కాడల నుంచి వేరు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మామిడికాయను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తరువాత రెండు మిరపకాయలను తీసుకుని చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరిని తీసుకుని దానిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఇప్పుడు 100 గ్రాముల బెల్లాన్ని తీసుకోవాలి. కొత్త బెల్లం వినియోగించాలి. దీనిని సిద్ధం చేసిపెట్టుకున్న చింతపండు రసంలో కలుపుకోవాలి. ఇప్పుడు అరటి పండును చిన్నగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు అరకప్పు చెరకు రసాన్ని వేసుకోవాలి. ఇప్పుడు మామిడికాయను, మిరపకాయ, కొబ్బరి ముక్కలు ఇందులో వేయాలి. ఇప్పుడు రుచికి సరిపడేటట్లు ఉప్పు వేసి కలపాలి అంతే షడ్రుచుల ఉగాది పచ్చడి సిద్ధమైనట్లే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories