Top
logo

జీవితం ఓ వ్యూహం.. వారితో కలిపినప్పుడే దానికి ఫలితం..

జీవితం ఓ వ్యూహం.. వారితో కలిపినప్పుడే దానికి ఫలితం..
X
Highlights

జీవితం ఓ వ్యూహం.. వారితో కలిపినప్పుడే దానికి ఫలితం.. జీవితం ఓ వ్యూహం.. వారితో కలిపినప్పుడే దానికి ఫలితం..

మనిషి సంఘజీవి.. ఏది చేసినా ఏది చేయాలన్నా.. అది ఇతరులతో సంబంధం ఉండాల్పిందే. ఈ సమాజం మనకు నచ్చలేదు కదా.. అని దాని అవతల బతకడం అనేది సుసాధ్యమైంది. మన చూట్టూ ఉండే మనుషుల మధ్యే. ఎవరితోనైనా మాట్లాడాలన్న, ఇతరులతో కలిపి పని చేయాలన్నా చాలా మంది మోహమాట పడుతుంటారు. నలుగురుతో కలిసి మాట్లాడడం, వారితో కలిసి భోజనం చేయడానికి కాస్త ఇబ్బంది పడుతుంటారు. అలా నలుగురు కలిసి ఎలా నడుచుకోవాలో ఓ సారి తెలుసుకుందాం.

ప్రముఖులతో భోజనం చేయాల్సి వచ్చినప్పుడు తోటివారికి ఇబ్బంది కలిగించని రీతిలో వ్యవహరించాలి. డైనింగ్‌ టేబుల్‌ కుర్చీ బరబరా లాగకుండా నెమ్మదిగా ఎత్తి వెనక్కు తీసి కూర్చోవాలి. అందరూ వచ్చేవరకు ఎదురుచూడాలి. వంటకాలు ఏమి చేసారని గిన్నెల మూతలు తీసి చూడరాదు. డైనింగ్‌ టేబుల్‌ మీద మోచేతులు పెట్టి కూర్చోరాదు. భోజన సమయంలో మౌనంగా, ముభావంగా ఉండకుండా సరదాగా మాట్లాడుతూ తినాలి.

సమాజంలో నిరాడంబరంగా బ్రతకాలన్నా సమస్యలను తట్టుకుని నిలవాలన్నా మాటే ముఖ్యం. నలుగురితో కలవడం.. నవ్వుతూ మాట్లాడటం ఓ సంఘజీవిగా మనం అనుసరించాల్సిన జీవన సూత్రం. ఇవి ఎంతో ముఖ్యం. మాట తీరు బట్టే సామాజిక సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. ఇల్లైనా, ఆఫీసైనా, కాలేజైనా నలుగురితో మాట్లాడడం, కలిసి పనిచేయడం తప్పనిసరి. మన మాటలే సంబంధ బాంధవ్యాలను ప్రభావితం చేస్తాయి. కావున సిగ్గు, బిడియంతో కాకుండా ఇతరులతో సూటిగా మాట్లాడడం నేర్చుకోండి.

Next Story