రుచికరమైన చెక్కర పొంగలి తయారీ ఎలా?

రుచికరమైన చెక్కర పొంగలి తయారీ ఎలా?
x
Highlights

కావలసిన పదార్ధాలు : బియ్యం : 1 కప్పు పంచదార : 2 కప్పులు పెసరపప్పు : 1/4 కప్పు యాలకులు : 6 పచ్చ కర్పూరం : చిటికెడు కన్నా తక్కువనెయ్యి : 3/4...

కావలసిన పదార్ధాలు :

బియ్యం : 1 కప్పు

పంచదార : 2 కప్పులు

పెసరపప్పు : 1/4 కప్పు

యాలకులు : 6

పచ్చ కర్పూరం : చిటికెడు కన్నా తక్కువనెయ్యి : 3/4 కప్పు

ఎండుకొబ్బరి ముక్కలు :1/4 కప్పు

జీడిపప్పు : 1/4 కప్పు

పాలు : 1/2 లీ

తయారీ విధానం .

స్టౌ మీద గిన్నె పెట్టి ఒక 2 కప్పుల నీళ్ళు పోసి కాగనివ్వాలి. కొంచం కాగాక కడిగిన బియ్యం, పెసరపప్పు వేసి కలిపి మూత పెట్టి ఉడికించాలి. సగానికి పైగా ఉడికాక పాలూ పోసి మళ్లీ ఉడికించాలి. అన్నం పూర్తిగా ఉడికాక అందులో పంచదార వేసి కలపాలి మిక్సీ జార్ లో యాలకులు, పచ్చ కర్పూరం, 2 స్పూన్స్ పంచదార వేసి మిక్సీ పట్టి అ పొడిని ఉడికే చెక్కర పొంగలి లో వేసి కలపాలి. దగ్గర పడ్డక నేతిలో వేయించిన ఎండుకొబ్బరిముక్కలు, జీడిపప్పులు వేయాలి. వేయించిన ఆ వేడి వేడి నెయ్యి కూడా వేసి బాగా కలిపాలి. స్టౌ ఆపి కొంచం చల్లారానివ్వాలి. చెక్కర పొంగలి రెడీ.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories