గోదావరి స్పెషల్ వంటకం పీతల కూర తయారీ ఎలా?

గోదావరి స్పెషల్ వంటకం పీతల కూర తయారీ ఎలా?
x
Highlights

సీఫుడ్స్ అయిన చేపలు, రొయ్యలు, పీతలను ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు... చేపల పులుసన్నా, పీతల కూరన్నా పడిచచ్చే వారు చాలా మందే ఉన్నారు. అందుకే ఇవాళ మనం...

సీఫుడ్స్ అయిన చేపలు, రొయ్యలు, పీతలను ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు... చేపల పులుసన్నా, పీతల కూరన్నా పడిచచ్చే వారు చాలా మందే ఉన్నారు. అందుకే ఇవాళ మనం గోదావరి స్పెషల్ వంటకం పీతల కూర తయారీ ఎలా? ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం..

కావాల్సిన పదార్ధాలు

పీతలు- రెండు

నల్ల వంకాయలు - నాలుగు

దనియాలు - రెండు టేబుల్ స్పూన్‌లు

లవంగాలు - నాలుగు

జీలకర్ర - టేబుల్ స్పూన్

ఉల్లిపాయల - రెండు

వెల్లుల్లి రెబ్బలు - ఎనిమిది

పచ్చిమిర్చి - ఆరు

పసుపు - అరటీస్పూన్

కారం - రుచికి సరిపడా

చిందపండు - నిమ్మపండంత

నూనె - సరిపడినంత

కొత్తిమీర

ఉప్పు - తగినంత

తయారీ విధానం :

ముందుగా రెండు పీతలను తీసుకుని వాటిని బాగా శుభ్రం చేసుకున్నాక ముక్కలగా చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలి... ఇప్పుడు ఉల్లిగడ్డలను మిక్సిలో వేసి కచపిచగా పేస్ట చేసుకోవాలి... ఇప్పుడు పచ్చి మసాలా కోసం దనియాలు, లవంగాలు, జీలకర్ర, వెల్లిల్లి రెబ్బలను మిక్సీలో వేసుకుని పేస్ట్‌ చేసి పెట్టుకోవాలి.

పెద్ద నిమ్మపండంత చింతపండును తీసుకుని నీటిలో నానబెట్టి పులుసు చేసుకోవాలి. అన్ని సిద్ధం చేసుకున్న తరువాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్‌ల నూనె వేసుకోవాలి. నూనె కాగిన తరువాత ఉల్లిపాయపేస్ట్ ను వేసుకోవాలి.. అందులోనే పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలి.. ఉల్లిపాయలు మగ్గేందుకు కాస్త ఉప్పు వేసుకోవాలి.. అలాగే పసుపు వేసుకోవాలి... ఇప్పుడు వీటన్నింటిని బాగా మగ్గనివ్వాలి.. ఉల్లిపాయలు మగ్గిన తరువాత ఇందులో పీతలు వేసుకోవాలి... బాగా కలుపుకోవాలి.. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో పీతలను మగ్గించాలి..ఐదు నిమిషాలు పూర్తైన తరువాత మూత తీసి కలుపుకోవాలి. ఇందులో కారం.. ఉప్పు వేసుకోవాలి.

వీటన్నింటిని బాగా కలుపుకోవాలి... మూత పెట్టి మళ్లీ 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి.. ఇప్పుడు చింతపండు రసం వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో దీన్ని ఉడికించుకోవాలి... ఇప్పుడు పొడవుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూరలో వేసుకోవాలి..వంకాయలను ముందుగా వేసుకుంటే పేస్ట్‌లా అయిపోతాయి.. పీతలు కాస్త ఉడికిన తరువాత మధ్యలో వేసుకోవాలి... మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో దగ్గర పడేంత వరకు ఉడికించాలి... ఇందులో తయారు చేసుకున్న పచ్చి మసాలాను వేసుకోవాలి.. కొత్తిమీర కూడా వేసుకోవాలి.. బాగా కలిసేలా ముక్కలను కలపాలి... ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్‌లో 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి..టేస్టీ గోదావరి జిల్లాల స్పెషల్ పీతల కూర రెడీ.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories