దాల్ మఖని ఎలా తయారు చేసుకోవాలంటే..

దాల్ మఖని ఎలా తయారు చేసుకోవాలంటే..
x
Highlights

ఎప్పుడూద మన తెలుగింటి వంటలేనా కాస్త... పక్క రాష్ట్రాల రుచులను కూడా పరిచయం చేసుకుందాం...రెస్టారెంట్‌ స్టైల్‌లో మంచి క్రీమీ టెక్స్‌చర్‌ తో దాల్ మఖని ఎలా...

ఎప్పుడూద మన తెలుగింటి వంటలేనా కాస్త... పక్క రాష్ట్రాల రుచులను కూడా పరిచయం చేసుకుందాం...రెస్టారెంట్‌ స్టైల్‌లో మంచి క్రీమీ టెక్స్‌చర్‌ తో దాల్ మఖని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం...ఈ దాల్ మఖని చపాతీ , పూరీ, అన్నంలోకి తిన్నాకొద్ది తినాలనిపిస్తుంది.

కావాల్సిన పదార్ధాలు :

*మినపగుళ్లు : అరకప్పు

*రాజ్మా : రెండు టేబుల్ స్పూన్‌లు

*టమాటాలు : మూడు

*అల్లం : ఇంచు

*వెల్లుల్లి రెబ్బలు : 15

*పచ్చిమిర్చి : ఐదు

*ఉల్లిగడ్డ : ఒకటి

*దాల్చీని చెక్క

*యాలాకులు: మూడు

*లవంగాలు: మూడు

*శనగపిండి : టీస్పూన్

*పసుపు : అరటీస్పూన్

*గరంమసాలా : టీస్పూన్

*కసూరీ మేంతీ : టీస్పూన్

*నీరు

*బటర్ : మూడు టీస్పూన్‌ లు

*ఫ్రెష్ క్రీమ్: రెండు టేబుల్ స్పూన్‌లు

*కొత్తిమీర

*ఉప్పు

తయారీ విధానం:

ముందుగా పొట్టు తీయని అరకప్పు మినపగుళ్లను బౌల్‌లోకి తీసుకోవాలి. ఇందులోనే రెండు టేబుల్ స్పూన్‌ల రాజ్మా కూడా వేసుకోవాలి. రాజ్మా అప్షనల్ కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు..అది మీ ఇష్టం. ఇందులో రెండు గ్లాసుల నీరు పోసి 4 నుంచి 5 గంటలు వరకు నానబెట్టుకోవాలి. మినపగుళ్లు నానిన తరువత గింజలను బాగా కడగాలి. కడిగిన మినపగుళ్లను రాజ్మాను కుక్కర్ లోకి తీసుకుని 2 కప్పులు నీరు పోయాలి. ఇందులోనే అరటీస్పూన్ ఉప్పు వేసుకోవాలి. టీస్పూన్ నూనె వేసుకుని 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పప్పు ఉడికిన తరువాత కుక్కర్ మూత తీసి పప్పును కొంచెం గంరిటెతో లైట్‌గా ప్రెస్ చేయాలి...కొంచెం క్రీమీగా వచ్చేందుకు లైట్‌గా ప్రెస్ చేసుకోవాలి..ఇప్పుడు మళ్లీ రెండు కప్పుల నీరు పోసుకుని కుక్కర్ మూత పెట్టుకోకుండా మళ్లీ పప్పు ను ఉడికించుకోవాలి. ఇది ఇలా ఉడుకుతూ ఉండగా... ఒక మిక్సీలోకి 3 టమాటలను తీసుకుని ప్యూరీ తయారు చేసుకోవాలి. పుల్లటి టమాటాలు దాల్ మఖనీలోకి చాలా బాగుంటాయి...

ఒక బౌల్ లోకి ఈ ప్యూరీని తీసుకోవాలి... ఇప్పుడు మిక్సీ జారక్ లో ఇంచు అల్లం, 15 వెల్లుల్లి రెబ్బలు, 5 పచ్చిమిర్చి... చిన్న దాల్చీని చెక్క, మూడు యాలాకులు, మూడు లవంగాలు వేసి కచపిచ గ్రైండ్ చేసుకోవాలి.. ఈ మసాల వేయడం వల్ల దాల్ మఖనికి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఉడుకుతున్న పప్పుపైన వచ్చే నురగను తీసేసేకోవాలి..... ఇప్పుడు మసాలను ఫ్రై చేసుకోవాలి..పాన్‌లో నెయ్యి వేసుకుని కట్ చేసిన పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలను వేసుకోవాలి... పచ్చిమిర్చి మసాలా పేస్ట్ ను ఇందులో వేసుకోవాలి...ఇందులో ఒక టీస్పూన్ శనగపిండిని వేసుకోవాలి. దీని వల్ల టెక్స్‌చర్ క్రీమీ క్రీమీ గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే పావు టీస్పూన్ పసుపు, రెండు టీస్పూన్‌ల కారం, టీస్పూన్ గరంమసాలా, అరటీస్పూన్ కసూరీ మేంతీ వేసుకోవాలి.

ఇప్పుడు టమోటా ప్యూరీని ఇందులో వేసుకోవాలి..రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి..ఇప్పుడు దాల్ వేసి బాగా కలపాలి..ఇందులో రెండు గ్లాసుల నీరు పోసుకుని 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకోవాలి.. పప్పును వీలైనంతగా సాఫ్ట్ గా ఉంచాలి..కన్సిస్టెన్సీ క్రీమీ క్రీమీగా ఉండాలి... చివరిలో మూడు టీస్పూన్‌ బటర్ వేసుకుందాం... దాల్ మఖనీ టేస్ట్ బాగుంటుంది. రెండు టేబుల్ స్పూన్ ల ఫ్రెష్ క్రీమ్ వేసి కలపాలి..క్రీం లేకపోతే పాలపైన మీగడను మిక్సీ పట్టి వేసుకుని కలుపుకోవచ్చు. చివరగా కొత్తిమీర వేసుకుని కలుపుకోవాలి.. అంతే టేస్టీ టేస్టీ క్రీమీ క్రీమీ దాల్ మఖనీ రెడీ.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories