ఆవు నెయ్యితో పిల్లలకు పసందైన మైసూర్‌పాక్‌.. తయారీ ఎలా?

ఆవు నెయ్యితో పిల్లలకు పసందైన మైసూర్‌పాక్‌.. తయారీ ఎలా?
x
Highlights

అన్నం తినమంటే మారాం చేసే పిల్లలు చిరుతిళ్ళు బాగా తింటారు. స్నాక్స్‌ అని స్వీట్స్‌ కావాలని మారాం చేస్తుంటారు.. అందునా చిన్నపిల్లలు ఖచ్చితంగా ఇటువంటి...

అన్నం తినమంటే మారాం చేసే పిల్లలు చిరుతిళ్ళు బాగా తింటారు. స్నాక్స్‌ అని స్వీట్స్‌ కావాలని మారాం చేస్తుంటారు.. అందునా చిన్నపిల్లలు ఖచ్చితంగా ఇటువంటి వాటికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అలాంటి పిల్లలకు ఇంటి పట్టునే రుచుకరమైన స్నాక్స్ స్వీట్స్ సిద్ధం చేసుకోవాలి... ఎక్కువ శాతం కార్బోహైడ్రేట్లు కలిగిన శనగపిండితో..ఆరోగ్యానికి మేలు చేసే ఆవు నెయ్యితో పిల్లలకు పసందైన నేతి మైసూర్‌ పాక్‌లు రెడీ చేయవచ్చు.. మరి ఇంకెందుకు ఆలస్యం మైసూర్ పాక్‌లు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.. పదండి.

కావాల్సిన పదార్ధాలు :

* శనగపిండి

* పంచదార కప్పు

* నెయ్యి రెండు కప్పులు

* సోడా చిటికెడు

తయారీ విదానం :

ముందుగా ఒక కడాయి తీసుకోవాలి అందులో నెయ్యి పోసి కాగనివ్వాలి. ఇప్పుడు మరో స్టవ్ అన్ చేసి మందంగా ఉండే గిన్నె తీసుకోవాలి. అందులో ఒక కప్పు పంచదార వేసుకోవాలి. అందులోనే కప్పు నీరు పోసి పాకం పట్టాలి. పంచదార బాగా కరిగే వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు పంచదార పాకం ఉడుకుతూ ఉండగానే నెయ్యిలో నాలుగో వంతు భాగాన్ని పాకంలో పోయాలి... కలుపుతూ ఉండాలి.. ఇప్పుడు ఒక కప్పు శనగపిడిని తీసుకోవాలి... దాన్ని పంచదార పాకంలో వేసుకోవాలి. శనగపిండి ఉండలు కట్టకుండా , అడుగు అంటకుండా గరిటెతో తిప్పుతూ ఉండాలి. నెయ్యి మధ్య మధ్యలో పోస్తూ ఉండాలి.. తిప్పుతూ ఉండాలి. నెయ్యి అంతా పూర్తి కాగానే శనగపిండి నేతిలో వేగగానే తెల్లగా నురుగు కనిపిస్తుంది.. ఈ నురుగు రాగానే చిటికెడు సోడా వేసుకోవాలి. మళ్లీ గరిటెతో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు అట్ల కాడ తీసుకుని పైన పైన వత్తుకోవాలి. మిశ్రమం వేడి మీద ఉన్నప్పుడే మనకు కావాల్సిన షేప్‌లను కత్తితో కోసుకోవాలి. మిశ్రమం మొత్తం చల్లారాక మనకు మైసూన్ పాక్‌లు రెడీ అవుతాయి..ఎంతో టేస్టీగా చాలా సులువుగా ఇంట్లోనే మైసూర్‌ పాక్‌లు సిద్ధం చేసుకోవచ్చు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories