డైట్ చేసే వారు వీటిని తింటే మంచిదట..

డైట్ చేసే వారు వీటిని తింటే మంచిదట..
x
Highlights

సాయంకాలం స్నాక్స్ కోసం ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లకు పరుగులు పెట్టే రోజులు ఇవి... ఏం తినాలనిపించినా... తాగాలనిపించినా... వాటి మీదే ఆధారపడుతున్నారు. పిల్లల...

సాయంకాలం స్నాక్స్ కోసం ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లకు పరుగులు పెట్టే రోజులు ఇవి... ఏం తినాలనిపించినా... తాగాలనిపించినా... వాటి మీదే ఆధారపడుతున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు వీటికి ఫస్ట్‌ ప్రియారిటీ ఇచ్చేస్తున్నారు..ఇంటి పట్టునే ఆరోగ్యకరమైన, రుచికరమైన వంటకాలు చేసుకునే తీరికే లేదంటారు. సమయం ఉన్నా లేకున్నా మనం ఆరోగ్యంగా ఉంటేనే ఆనంతం...ఐశ్వర్యం... అందుకే ఈవినింగ్ స్నాక్ ఐటైం కోసం ఇప్పుడు మంచి రెసిపీ మీకు చెప్పాస్తాం...అదే కిత్తిమీర ఆవిరి వడలు...వింటుంటే నోరు ఊరుతోంది కదూ... ప్రస్తుతం మార్కెట్‌లో చాలా ప్రెష్ కొత్తిమీర లభిస్తోంది.. కొత్తిమీరతో చట్నీ చేసుకోవడమే కాదు... స్నాక్ గా చేసుకుని చకచకా లాగించేద్దాం..

కావాల్సిన పదార్ధాలు :

*కొత్తిమీర : రెండు కప్పులు

*శనగపిండి : రెండు టేబుల్‌స్పూన్‌లు

*బియ్యం పిండి : ఒక టేబుల్‌స్పూన్‌

*చిన్న అల్లం ముక్క

*పచ్చిమిర్చి: నాలుగు

*జీలకర్ర : అరటీస్పూన్

*నువ్వులు : రెండు టీస్పూన్‌లు

*పసుపు : పావు టీస్పూన్‌

*ఉప్పు : రుచికి సరిపడా

*నీరు : తగినంత

*నూనె : డీప్‌ ఫ్రైకి సరిపడా

తయారీ విధానం :

ముందుగా కొత్తిమీర ను తీసుకుని కాడలను కట్‌ చేసుకునా బాగా కడగాలి... రెండు కప్పుల కొత్తిమీర ఆకులకు ..రెండు టేబుల్ స్పూన్‌ల శనగపిండి వేసుకోవాలి.. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకుని కలుపుకోవాలి...ఇప్పుడు చిన్న అల్లం ముక్క నాలుగు పచ్చిమిర్చిని కచపిచ దంచుకుని దానిని వేసుకోవాలి. ఇందులోనే అరటీస్పూన్ జీలకర్ర, రెండు టీస్పూన్‌ల నువ్వులు వేసుకోవాలి...నువ్వులను తప్పనిసరిగా వినియోగించాలి...దీని వల్ల కొత్తిమీర వడలకు మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు పావు టీస్పూన్ పసుపు వేసుకోవాలి... పసుపు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు.

రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి...పిండి డ్రైగా కనిపిస్తే..కాస్త నీరు కలుపుకోవాలి. పిండిని కాస్త గట్టిగా ప్రెస్ చేస్తూ కలపాలి...చపాతీ పిండి ముద్దలా చేసుకోవాలి.. చేతులకు నూనె రాసుకుని పిండిని కలుపుతూ ఉండాలి. పిండిని రౌండ్ లేదా నచ్చిన షేప్ వచ్చేలా చేసి దీనిని స్టీమ్ మీద కుక్ చేసుకోవాలి. ఇప్పుడు జాలి గిన్నెను తీసుకుని నూనె రాసి.. ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొత్తిమీర మిక్స్‌ను అందులో పెట్టుకోవాలి.. మరో గిన్నెలో రెండు గ్లాసుల నీటిని తీసుకుని మరిగించాలి... ఇప్పుడు వడ మిక్స్ ఉన్న జాలి గిన్నెను దాని మీద ఉంచాలి. ఇప్పుడు వడ గిన్నె మీద మూత పెట్టు 15 నుంచి 20 నిమిషాల పాటు ఆవిరిపట్టాలి. 15 నిమిషాల తరువాత కొత్తిమీర వడ మిక్స్‌ను బయటకు తీయాలి.. ఇది పూర్తిగా చల్లారాక వడల్లాగా కట్ చేసుకోవాలి. ఈ వడలను ప్లేట్‌ లోకి తీసుకోవాలి...ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టాలి. అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి.. నూను మరిగిన తరువాత వడలను ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలి. బజ్జీల్లా ఫ్రై చేయాలి..గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చాక తీసుకోవాలి... క్రిస్పీ క్రిస్పీ వేడి వేడి కొత్తి మీర వడలు రెడీ...

ఈ కొత్తిమీర వడలను హెల్దీగా తినాలనుకుంటే ఆవిరి పట్టినవాటినే తినేయవచ్చు.... డైట్ చేసే వారు వీటిని తింటే చాలా మంచిది. స్టీమ్ చేసిన వడలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి.. వీటిని క్రిస్పీగా తినాలనుకున్నా... రైస్‌లో సైడ్ డిష్‌గా తినాలనుకున్నా... నూనెలో ప్రై చేసుకుని తినవచ్చు.. ఎలా తిన్నా టేస్టీగా ఉంటాయి... పిండిని కలిపేటప్పుడు ఉప్పు కారం సరిగా ఉండేలా చూసుకుంటే చాలు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories