చక్కటి కోల్డ్ కాఫీనీ ఇలా తయారు చేసుకోండి

చక్కటి కోల్డ్ కాఫీనీ ఇలా తయారు చేసుకోండి
x
Highlights

వేడి వేడిగా కాఫీ తాగే ట్రెండ్ ఎప్పుడో మారిపోయింది.. కూల్డ్‌ కాఫీతో కాఫె టేరియాలో ఎంజాయ్ చేసే రోజులివి.

వేడి వేడిగా కాఫీ తాగే ట్రెండ్ ఎప్పుడో మారిపోయింది.. కూల్డ్‌ కాఫీతో కాఫె టేరియాలో ఎంజాయ్ చేసే రోజులివి... ఫ్రెండ్స్‌తో బయటికి వెళ్లిగా.. ఫ్యామిలీ షాపింగ్‌కి వెళ్లినా కాస్త హుషారు అందించే.. కోల్డ్ కాఫీలకు అందరూ అట్రాక్ట్ అవుతున్నారు. మరి అన్ని వేళలా కాఫీ షాప్‌లకు వెళ్లలేము కదా.. అందుకే ఇంట్లోనే చక్కటి కోల్డ్ కాఫీనీ.. టేస్టీగా రెడీ చేసేసుకుందాం..

కావల్సిన పదార్ధాలు:

పాలు

♦ కోకో పౌడర్

♦ ఇన్‌స్టెంట్ కాఫీ పౌడర్

♦ కాఫీ డికాషన్

♦ చక్కెర

♦ ఫ్రెష్ క్రీం

♦ దాల్చిన చెక్క

♦ బాదం

♦ పిస్తా

♦ ఐస్‌ క్యూబులు

తయారీ విధానం:

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి అందులో రెండు కప్పుల పాలు పోసుకోవాలి. పాలను బాగా మరిగించాలి.. ఆ తరువాత చల్లార్చాలి... పాలు చల్లార్చిన తరువాత ఒక రెండు గంటల పాటు ఫ్రిజ్‌లో పాలను ఉంచాలి... ఇప్పుడు డికాషన్ తయారు చేసుకోవాలి... అదెలా అంటే ఒక బ్లండర్ మెషిన్‌లో అరకప్పు కాఫీ డికాషన్ వేసుకోవాలి. అందులోనే ఆల్‌రెడీ మరిగించి చల్లార్చి ఫ్రిజ్‌లో పెట్టుకున్న రెండు కప్పుల పాలు పోసుకోవాలి... టేస్ట్‌కి సరిపడినంత చక్కెరమ వేసుకోవాలి... ఆరు ఐస్‌క్యూబ్స్‌ వేసుకోవాలి.. ఇందులోనే టేబుల్ స్పూన్ కోకోపౌడర్ కూడా వేసుకోవాలి. వీటన్నిటిని బాగా నురుగు వచ్చేలా బ్లండ్ చేసుకోవాలి.

ఇప్పుడు వేరొక గిన్నె తీసుకోవాలి. అందులో క్రీం ను వేసుకోవాలి అందులో ఐస్‌ క్యూబ్స్ వేసుకుని నురుగు వచ్చేలా గిలకొట్టాలి.. పంచదార కూడా వేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ కప్స్ తీసుకోవాలి. ఇదులో కప్పులో ముప్పావు వంతు బ్లండ్ చేసిన పాలను పోసుకోవాలి.. పైన క్రీమ్ వేసుకోవాలి. తరువాత పావు టీస్పూన్ కాఫీ పొడి చల్లాలి... దానిపైనే పావు టీస్పూన్ దాల్చిన చెక్కపొడి , బాదం పిస్తా తరుగుతో గార్నిష్‌ చేసుకోవాలి.. అంతే ఇంట్లోనే ఇన్‌స్టెంట్ కోల్డ్ కాఫీ రెడీ... ఇంకెందుకు ఆలస్యం మీరూ దీనిని ట్రై చేసి మంచి రుచిని ఆస్వాధించండి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories