శీతాకాలంలో వేడి వేడి రుచికరమైన భోజనం చేయాలని ఉందా?

శీతాకాలంలో వేడి వేడి రుచికరమైన భోజనం చేయాలని ఉందా?
x
Highlights

చలచల్లని శీతాకాలంలో వేడి వేడి రుచికరమైన భోజనం చేయాలని అందరికి ఉంటుంది...అలాంటి టైంలో బెస్ట్ అండ్ టేస్టీ రెసిపీ ఛొలే పులావ్ రైస్. దీని టేస్ట్ అదరహో...

చలచల్లని శీతాకాలంలో వేడి వేడి రుచికరమైన భోజనం చేయాలని అందరికి ఉంటుంది...అలాంటి టైంలో బెస్ట్ అండ్ టేస్టీ రెసిపీ ఛొలే పులావ్ రైస్. దీని టేస్ట్ అదరహో అనిపిస్తుంది..చాలా తక్కువ సమయంలో టేస్టీగా దీనిని వండుకోవచ్చు.. టేస్ట్ లోనే కాదు ఇది హెల్దీ రెసిపీ...చిన్నపిల్లలు కూడా ఎంతగానో ఇష్టపడతారు..సాధారణంగా ఇలాంటి రైస్ రెసిపీల కోసం రెస్టారెంట్‌లు దాబాలకు వెల్లకుండానే ఇంటిపట్టునే టేస్టీగా తయారు చేసుకునే విధానం ఇప్పుడు మనం చూసేద్దాం పదండి.

కావాల్సిన పదార్ధాలు :

*కాబూలీ శనగలు : ఒక కప్పు

*బాస్మతీ బియ్యం : ఒక కప్పు

*ఉల్లిపాయలు

*నూనె, నెయ్యి

*బగారా ఆకులు

*లవంగాలు

*పచ్చిమిర్చి

*టమాటాలు

*పసుపు

*దాల్చీని చెక్క

*జాజిపప్పు

*యాలాకులు

*సాజీరా

*జీలకర్ర*కారం

*కొత్తిమీర

*నిమ్మరసం

*దనియాల పొడి

*గరం మసాలా

*కసూరీ మేంతీ

*ఉప్పు

తయారీ విధానం :

ముందుగా ఒక కప్పు కాబూలీ శనగలను తీసుకోవాలి..వీటిని 5 గంటల పాటు నీటిలో నాలబెట్టుకోవాలి.. ఉదయం చేసుకునేటట్లైతే..రాత్రే నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న కాబూలీ శనగలను కుక్కర్ లోకి తీసుకుని ఒకటిన్నర కప్పు నీరు పోసుకుని అందులో కొద్దిగా ఉప్పు వేసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. శనగలను 80 శాతం ఉడికించుకోవాలి.

ఇప్పుడు ఒక కప్పు బాస్మతీ రైస్ తీసుకుని ..బాగా కడుక్కోవాలి...రైస్ ను 20 నిమిషాల పాటు నీటిలో ననబెట్టాలి. ఇప్పుడు కుక్కర్లోని ఛోలేలను తీసుకోవాలి..మరీ మెత్తగా ఉడికకుండా చూసుకోవాలి. పులావ్ ను కుక్కర్ లోనే చేసుకుందాం... ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని అందులో నూనె వేసుకుందాం... నెయ్యి తీసుకునేవారు... నెయ్య కూడా వేసుకోవచ్చు.. తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసుకుందాం... లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటని వేపుకోవాలి..ఇప్పుడు ఇందులో రెండు బిర్యానీ ఆకులు, లవంగాలు, దాల్చీని చెక్క, జాజిపప్పు, యాలాకులు, సాజీరా, జీలకర్ర వేసుకోవాలి. మసాలాలు ముందుగా వేస్తే మాడిపోతాయి కాబట్టి, ఉల్లిగడ్డలను మగ్గబెట్టుకుని ఆ తరువాత మసాలాలను వేసుకన్నాను..

ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి, రెండు టమాట ముక్కలను వేసుకుని 2 నిమిషాలు ఫ్రై చేసకోవాలి. ఇప్పుడు పావు టీస్పూన్ పసుపు,, టేబుల్ స్పూన్ కారం, టీ స్పూన్ దనియాల పొడి, అర టీస్పూన్ గరం మసాలా , కసూరీ మేంతీ, ఉప్పు ఒకదాని తరువాత ఒకట వేసుకుంటూ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న ఛోలేలను వేసుకోవాలి..అలాగే నానబెట్టిన రైస్ ను మిక్స్ చేసుకోవాలి. ఒక కప్పు బియ్యానికి ఒకటిన్నర కప్పు నీటిని వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి... ఇప్పుడు కొత్తిమీర , అరచెక్క నిమ్మరసం వేసుకుని బాగా కలుపుకోవాలి... ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకుందాం...విజిల్ లోని గాలి మొత్తం పోయాక మూత తీసుకోవాలి....వెరీ టేస్టీ ఛోలే పులావ్ రైస్ రెడీ... నార్మల్ రైస్ అయితే 3 విజిల్స్ వరకు ఉడికించవచ్చు.. రైతాతో కలిపి ఈ ఛోలే పులావ్ తింటే... రెస్టారెంట్లు కూడా బలాదూరే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories