టేస్టీ గోబిపువ్వు మసాలా గ్రేవీ తయారీ ఎలా?

టేస్టీ గోబిపువ్వు మసాలా గ్రేవీ తయారీ ఎలా?
x
Highlights

ఏ సీజన్‌ లో లభించే కూరగాయలను ఆ సీజన్‌లో తప్పక రుచిచూడాల్సిందే..వాటి యొక్క రియల్ టేస్ట్‌ను ఆశ్వాదించాల్సిందే...ప్రస్తుతం మార్కెట్‌లో గోబీపువ్వు...

ఏ సీజన్‌ లో లభించే కూరగాయలను ఆ సీజన్‌లో తప్పక రుచిచూడాల్సిందే..వాటి యొక్క రియల్ టేస్ట్‌ను ఆశ్వాదించాల్సిందే...ప్రస్తుతం మార్కెట్‌లో గోబీపువ్వు అదే...కాలీఫ్లవర్ విరివిరిగా లభిస్తున్నాయి.. ఇందులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఇది చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. జీర్ణ వ్యవస్థను సవ్యంగా నడుపుతుంది. వివిధ రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంతో పాటు సూక్ష్మ క్రిముల నుంచి శరీరాన్ని శుభ్రపరుస్తుంది. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ గోబిపువ్వును అంత ఈజీగా వదులుతామా...చక్కటి టేస్టీ గోబిపువ్వు మసాలా గ్రేవీని రెడీ చేద్దాం..పదండి..

కావాల్సిన పదార్ధాలు :

*ఉల్లిపాయలు

*జీడిపప్పు

*కాలీఫ్లవర్

*టమోటాలు

*సోంపు

*అల్లం వెల్లుల్లి పేస్ట్‌

*పసుపు

*కారం

*లవంగాలు

*యాలకులు

*దాల్చీని

*బగారా ఆకులు

*దనియాల పొడి

*జీలకర్ర పొడి

*పెరుగు

*నిమ్మరసం

*గరంమసాలా

*నూనె

*కొత్తిమీర

*క్రీం

*పంచదార

*ఉప్పు

తయారీ విధానం :

ముందుగా గోబీపువ్వు రెమ్మలను తీసి పెట్టుకోవాలి...దీనిని పండించేంందుకు ఎన్నో మందులను పిచికారీ చేస్తారు కాబట్టి కాస్త కాగే నీటిలో పువ్వు రెమ్మలను వేసి ఉడికించుకోవాలి... ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ రెమ్మలను వడకట్టి కాసేపు ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీ కడాయి పెట్టి డీప్‌ ఫ్రై కి సరిపడా నూనె పోసి ఈ రెమ్మలను ఫ్రై చేసుకోవాలి.

ఫ్రై చేసుకున్న గోబీపువ్వు రెమ్మలను పక్కన తీసి పెట్టుకోవాలి. గ్రేవీ కాబట్టి జీడిపప్పును ఒక 15 నిమిషాల పాటు నీటిలో నానబెట్టాలి. తరువాత టమాటా ముక్కలను తీసుకుని కట్‌ చేసుకుని మిక్సీలో వేసి పేస్ట్ మాదిరిగా తయారు చేసుకోవాలి. ముందుగా వంటకు కవాల్సినవన్నీ ఇలా రెడీ చేసుకుని పెట్టుకుంటే ఏ టేస్ట్ ను మిస్ అవ్వము..ఇప్పుడు కడాయి తీసుకుని స్టవ్ మీద పెట్టాలి. ఇందులో నూనె పోసుకోవాలి...నూనె కాస్త కాగాక సోంపు, దాల్చీని, యాలాకులు, లవంగాలు , బగారా ఆకులు వేయాలి. వీటిని లో ఫ్లేమ్‌లో రెండు నిమిషాల పాటు ఫ్రై కానివ్వాలి...ఇప్పుడు పసుపు, కారం, అల్లంపేస్ట్ , గరంమసాలా, వేసుకుని కాసేపు ఫ్రై చేయాలి. మసాలాలను ఇలా ఫ్రై చేయడం వల్ల డిష్‌కు మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులోనే ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకోవాలి.

ఉల్లిపాయ ముక్కలను బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఆల్‌రెడీ నానబెట్టి పేస్ట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు ముద్దను ఇందులో వేసుకోవాలి. టమోటా గుజ్జు ను వేయాలి. వీటిని కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు కాస్త వాటర్ యాడ్ చేసుకోవాలి. చక్కెర వేసుకుంది..చక్కెర వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. సరిపడ ఉప్పు వేసి గ్రేవీని సిమ్‌లో ఉడకనివ్వాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసిన పెట్టుకున్న గోబీ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి..ఇప్పుడు కొత్తిమీర వేసి సిమ్‌లో 10 నిమిషాలు ఉడికించాలి... చివరగా క్రీం వేసుకుని రెండు నిమిషాల పాటు గ్రేవీని మగ్గనివ్వాలి..అంతే వేడి వేడి గోబిపువ్వు మసాలా గ్రేవీ రెడీ.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories