అందరూ ఇష్టపడే ఆ చట్నీ తయారీ ఎలా?

అందరూ ఇష్టపడే ఆ చట్నీ తయారీ ఎలా?
x
Highlights

క్యాబేజీ అంటే పిల్లలు పెద్దగా ఇష్టపడరు..కూరలు వండితే అస్సలు తినేందుకు అంగీకరించరు.అందుకే అందరూ మెచ్చే విధంగా క్యాబేజీతో ఎంతో రుచికరమైన పచ్చడి తయారు...

క్యాబేజీ అంటే పిల్లలు పెద్దగా ఇష్టపడరు..కూరలు వండితే అస్సలు తినేందుకు అంగీకరించరు.అందుకే అందరూ మెచ్చే విధంగా క్యాబేజీతో ఎంతో రుచికరమైన పచ్చడి తయారు చేసుకోవచ్చు..మరి క్యాబేజీ పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం పదండి.

కావాల్సిన పదార్ధాలు

క్యాబేజి

పచ్చిమిర్చి

వేరుశనగగుళ్ళు

ఎండు మిర్చి

నూనె

జీలకర్ర

పసుపు

మినపప్పు

ఉప్పు

కరివేపాకు

తయారీ విధానం

ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకోవాలి..అందులో ఒక కప్పు వేరుశనగుళ్ళు వేసుకోవాలి. బాగా వేయించాలి..అందులోనూ నాలుగు ఎండు మిరపకాయలు వేసి ఈ రెండింటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ప్లేట్‌లోకి తీసుకోవాలి..చల్లారనివ్వాలి. ఇప్పుడు వీటిని మిక్సీలో వేసుకుని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. మళ్లీ స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి..ఇందులో కాస్త నూనె వేసుకోవాలి. నూనె కాగాక అరటీస్పూన్ జీలకర్ర వేసుకోవాలి కాస్త చిటపటలాడాక ఇందులో ఐదు పచ్చిమిరపకాయలను వేసుకోవాలి.

తరువాత క్యాబేజీని బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు పసుపు, ఉప్పు కూడా వేసి బాగా మగ్గించాలి. ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న వేరుశనగగుళ్ళు పొడిని వేసుకోవాలి..బాగా కలిపి మగ్గనివ్వాలి. ఇప్పుడు ఈ క్యాబేజీ మిశ్రమాన్ని మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. కాస్త కచపిచగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చట్నీకి కావాల్సిన పోపును సిద్ధం చేసుకుందాం...ఇప్పుడు మళ్లీ స్టవ్ మీద కడాయి పెట్టాలి.‌ కాస్త నూనె వేసుకోవాలి. నూనె కాగాక ఇందులో జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసి వేగనివ్వాలి...బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి కరివేపాకు రెబ్బలను వేసుకోవాలి..ఈ పోపును పచ్చడిలో వేసి బాగా కలుపుకోవాలి అంతే క్యాబేజీ పచ్చడి రెడీ.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories