వంకాయ రోటి పచ్చడి తయారీ ఇలా..

వంకాయ రోటి పచ్చడి తయారీ ఇలా..
x
Highlights

వంకాయతో రోటి పచ్చడి....అనగానే నోరు ఊరుతోంది కదా...తాజా కూరలలో రాజా అయిన వంకాయతో చేసిన వంటకాలు అందరి మనస్సును లాగేస్తాయి...నిత్యం వంకాయతో ఏదో ఒక వంట...

వంకాయతో రోటి పచ్చడి....అనగానే నోరు ఊరుతోంది కదా...తాజా కూరలలో రాజా అయిన వంకాయతో చేసిన వంటకాలు అందరి మనస్సును లాగేస్తాయి...నిత్యం వంకాయతో ఏదో ఒక వంట చేస్తూనే ఉంటాయి..చిన్నవారి నుంచి పెద్దవారి వరకు అందరికీ ఇదంటే యమ ఇష్టం..ఈ వంకాయ రోటి పచ్చడి కేవలం 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. అన్నంలో , చపాతీలో ఈ డిష్ చాలా బాగుంటుంది...ఎప్పుడు వంకాయ కర్రీ కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు బాగా నచ్చుతుంది.

కావాల్సిన దార్ధాలు :

*వంకాయలు : 250 గ్రాములు

*పచ్చిమిర్చి : 10 -12

*ఉల్లిగడ్డ : ఒకటి

*నూనె : సరిపడినంత

*అల్లం ముక్క : చిన్నది

*వెల్లుల్లి రెబ్బలు : 6-7

*జీలకర్ర : అరటీస్పూన్

*పసుపు : చిటికెడు

*శనగపప్పు : అరటీస్పూన్

*మినపప్పు : అరటీస్పూన్

*ఆవాలు : అరటీస్పూన్

*కరివేపాకు : రెండు రెబ్బలు

*ఎండు మిర్చి : రెండు

*చింతపండు : నిమ్మపండు సైజు

తయారీ విధానం

ముందుగా వంకాయలకు తీసుకుని శుభ్రంగా కడికి వాటికి నూనె రాసుకోవాలి...ఇలా నూనె రాసి వంకాయలను కాల్చడం వల్ల మెత్తగా మగ్గుతాయి...అలాగే పొట్టు కూడా సులువుగా వచ్చే స్తుంది.. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దాని మీద స్టాండ్ పెట్టుకుని వంకాయలను కాల్చుకోవాలి...హై ఫ్లేమ్ లో వంకాయలను కాల్చుకోవాలి...ఇవి కాలేందుకు కొంచెం సమయం పడుతుంది.. హై ఫ్లేమ్ పెట్టాము కాబట్టి వంకాయలను మార్చుతూ బాగా కాల్చాలి...కాలిన వంకాయలను ఇప్పుడు ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో నూనె పోసుకోవాలి...నూనె వేడయ్యాక. పచ్చిమిరపకాయలను వేయాలి...ఇందులోనే ఉల్లిపాయలు, చిన్న అల్లం ముక్క వేసి ఫ్రై చేయాలి..కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి.... నిమ్మ సైజు చింతపండి ఇందులోనే వేయాలి...వీటన్నింటిని వేపుకోవాలి. బాగా వేగాక వీటిని చల్లారనివ్వాలి... ఇప్పుడు వంకాయలు చల్లారాక పై పొట్టును తీసివేయాలి... వంకాయ తొడిమెలను తీసివేయాలి..ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలను మిక్సీలో వేసుకోవాలి..ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, పసుపు, ఉప్పు వేసుకోవాలి.. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి...ఇప్పుడు వంకాయలను వేసుకోవాలి...ఎక్కువ సేపు గ్రైండ్ చేయకుండా ఒకటి రెండు సార్లు గ్రైండ్ చేసుకోవాలి..బరకగా ఉండేటట్లు మిక్సీ పట్టాలి...రోట్లో కూడా రుబ్బుకోవచ్చు..వెసులుబాటు ఉంటే..ఇలా రుబ్బుకున్న పచ్చడిని పక్కన పెట్టుకుని ఇప్పుడు పోపు వేసుకుందాం.. పోపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి...నూనె వేసుకోవాలి. ఇందులో శనగపప్పు, మినపప్పు, ఆవాలు వేసుకుని వేపుకోవాలి. ఇప్పుడు ఎండు మిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి...స్టవ్ ఆఫ్ చేసి పచ్చడిని ఇందులో వేసుకుందాం....అంతా బాగా కలుపుకోవాలి... నోరూరించే రోటి వంకాయ పచ్చడి రెడీ.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories