Relationship News: భార్య భర్త నుంచి ఆర్థిక విషయాలు ఎలా తెలుసుకోవాలి..!

Relationship News: ప్రతి అమ్మాయి పెళ్లి తర్వాత తన జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది.

Jyothi
Updated on: 23 March 2024 9:30 PM IST
How to know financial matters from husband and wife can be learned in these three methods
X

Relationship News: భార్య భర్త నుంచి ఆర్థిక విషయాలు ఎలా తెలుసుకోవాలి..!

Relationship News: ప్రతి అమ్మాయి పెళ్లి తర్వాత తన జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. ఇది భర్త ఆర్థిక పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. పెళ్లి తర్వాత ఖర్చులు పెరుగుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే ఒక అమ్మాయి ఆర్థిక విషయాల గురించి చర్చించడం చాలా అవసరం. భర్తతో అయినా లేదా కాబోయే భర్తతో అయిన సంపాదన, ఆదాయం, ఖర్చుల గురించి ఏ విధంగా మాట్లాడాలో ఈ రోజు తెలుసుకుందాం.

ఇద్దరు వ్యక్తుల భవిష్యత్‌ విషయానికి వస్తే డబ్బు అవసరం చాలా ఉంటుంది. ఇందులో ముఖ్యంగా భర్త సంపాదన, ఆదాయ వనరు గురించి తెలుసుకోవడం అవసరం. అయితే దీని గురించి అతడితో మర్యాదగా మాట్లాడాలి. కించపరిచే విధంగా ఉండకూడదు. అలాగే అడుగుతున్నప్పుడు తనను విచారిస్తున్నట్లుగా ఉండకూడదు. ఇంకా ఇప్పుడే ఈ విధంగా అడుగుతుంది.. పెళ్లి తర్వాత ఎలా ఉంటుందో అనే అనుమానం రాకూడదు. ఎందుకంటే చిన్న పొరపాటు జరిగినా ఇద్దరి మధ్య రిలేషన్‌ షిప్‌ కట్‌ అవుతుంది. డబ్బు గురించి మాట్లాడటం సాధ్యం కాకపోతే వారి ఇష్టాలు, అయిష్టాల గురించి తెలుసుకుంటూ చివరికి ఈ టాపిక్‌ మాట్లాడాలి. దీనివల్ల వారు తప్పుగా అర్థం చేసుకోకుండా ఉంటారు.

వాస్తవానికి డబ్బు చర్చ ఎవరికీ అంత సులభం కాదు. కానీ మీరు మీ కాబోయే భర్తతో అతని ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలి, కొత్త ఉద్యోగం, కొత్త ఉపాధి, కొత్త ఇల్లు కొనాలనే కల వంటి భవిష్యత్‌ ప్రణాళిక గురించి చర్చించవచ్చు. ఇలాంటి ప్రశ్నలు అడగడం వల్ల ఎవరికీ బాధ కలగదు వారి ఆర్థిక పరిస్థితి గురించి కూడా ఒక అంచనా వస్తుంది. అప్పుడు ఇద్దరూ కలిసి వారి ఐడియాస్‌ను షేర్‌ చేసుకొని ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది.

Jyothi

Jyothi

Next Story