మెదడుకు మేత పెట్టండి..!

మెదడుకు మేత పెట్టండి..!
x
Highlights

నిన్న బాస్ ఏదో చెప్పాడు మరిచిపోయానే... అబ్బ ఇక్కడే పెట్టిన బుక్ ఎక్కడికి వెళ్లిపోయింది... అయ్యో ఈ రోజు బ్యాంకుకు వెల్దామనుకున్నా అస్సలు గుర్తే లేదు.....

నిన్న బాస్ ఏదో చెప్పాడు మరిచిపోయానే... అబ్బ ఇక్కడే పెట్టిన బుక్ ఎక్కడికి వెళ్లిపోయింది... అయ్యో ఈ రోజు బ్యాంకుకు వెల్దామనుకున్నా అస్సలు గుర్తే లేదు.. టేబుల్ మీదే పెన్ ఉండాలని ఏంటి కనిపించదే ఇలా సర్వసాధారణంగా రోజూ మనం మరిచిపోయే చిన్న చిన్న సంఘటనలు...ఇవి చిన్నవే కానీ సమస్య పెద్దది అదే మతిమరుపు...అస్సలు వయస్సుతో సంబందం లేకుండా ఈ మధ్యకాలంలో అందరినీ వేదిస్తున్న సమస్య ఇది. మెదడుకు ఎంతగా పని కల్పిస్తే.. అంతగా పని చేస్తుదని అంటుంటారు..కానీ ప్రస్తుతం ఆధునపోకడలతో పాటు అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో మెదడుపై భారం తగ్గి...మెదడులో జరగాల్సిన అభివృద్ధి ఆగిపోతుందనే భయం కూడా వేస్తుంది. దీనినే అల్జీమర్స్ అని అంటారు...ప్రస్తుతం ఈ వ్యాధిని నివారించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు.

టెక్నాలజీ అరచేతిలోకి వచ్చిన తరువాత మెదడును ఎలా వాడుకోవాలో చాలా మంది మరిచిపోయారు. దాని పనితీరుపై శ్రద్ధ చూపడం లేదు...ఒకప్పుడు లెక్కలైనా.. గుర్తుండిపోయే రోజులైనా నోటి లెక్కల మీద చెప్పేవారు.కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కానరావడం లేదు..మెదడు మొద్దుబారిపోయింది...యంత్రాలను నమ్మకునే జీవనం సాగిస్తున్నారు. ఒకప్పుడు మతిమరుపు వృద్ధులకు ఉండేది..కానీ ఈ సమస్య ఇప్పుడు అందరిలోనూ ఉంది.

మరి అన్ని వయస్కుల వారిని వేధిస్తున్న ఈ సమస్యను అధిగమించాలంటే..కొన్ని వ్యాపామాలు నియమాలు, పద్దతులు పాటించాలంటున్నారు నిపుణులు. అవేంటంటే...ఒంటి కాలుపై నిలబడి వ్యాయామం చేయడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉండటానికి దోహదపడుతుంది..రోజూ కనీసం ఒక గంట సేపైనా వ్యాయామం చేస్తే శారీరక, మానసిక ఆరోగ్యానికి మంచిది. శరీరకమే కాదు మానసిన వ్యాయామం తప్పనిసరి. మెదడుకు పదును చెప్పే గేమ్స్, పజిల్స్ అడుతూ ఉండాలి..ధ్యానం లాంటివి చేస్తూ ఉండాలి..ఎప్పటికప్పడు కొత్త విషయాలను తెలుసుకుంటూ ఉండాలి. కొత్త భాష, సంగీతం, వంటలు వంటివి నేర్చుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగవుతుంది. ఇక ఎమ్టీ మైండ్ ఈజ్ ఏ డెవిల్స్ వర్క్‌షాప్ అన్నట్లు...మెదడును ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు..ఎప్పుడు ఏదో ఒక పని చెబుతూ ఉండాలి...కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవాలి....ఇలా ఏదో ఒక పనిలో నిమగ్నం అవ్వాలి...రోజులో కనీసం 6 నుంచి 7 గంటల పాటు నిద్ర పోవడం తప్పనిసరి. మెదడు పనితీరు మెరుగవుతుంది.

మతిమరుపును నివారించేందుకు కొత్త కొత్త డైట్‌లను పరిచయం చేస్తున్నారు. శాస్త్రవేత్తలు. సరికొత్త ప్రయోగాలు, పరిశోధనలు చేస్తున్నారు. పచ్చని ఆకుకూరలు తీసుకోవడం వల్ల చక్కటి ఫలితం ఉంటుందట. పాలకూర, తోటకూర, బచ్చలి వంటి ఆకుకూరలను తరుచుగా తీసుకుంటూ ఉండాలి..ఇక కూరగాయల్లో కాలీఫ్లవర్, బ్రోకలి వంటి వాటిని తీసుకుంటూ ఉండాలి..వీటిలో ఫోలేట్, విటమిన్ బి9 ఎక్కువగా ఉండటం వల్ల జ్ఞాపకశక్తి పెరిగి బత్తిగి తగ్గుతుందట. వారానికి కనీసం రెండు సార్లు అయినా...ఆకుకూరలను తీసుకుంటే ఈ వ్యాధిని నివారించవచ్చు. డ్రైఫూట్స్‌ మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఉపకరిస్తాయట..అందుకే వీటిని తీసుకుంటూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. వారానికి ఐదు రోజులు వీటిని తీసుకోవాలి. ఇందులో ముఖ్యంగా జీడిపప్పు, బాదాం పప్పు,డ్రై అంజీరా ఎక్కువగా తీసుకోవాలి. బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, చెర్రీ పండ్లను తీసుకుంటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఇక తృణధాన్యాలను తినడం వల్ల మెదడుకు మంచే జరుగుతుందని అంటున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories