చుండ్రు సమస్యకు చిన్న చిట్కా!

చుండ్రు సమస్యకు చిన్న చిట్కా!
x
Highlights

చుండ్రు సమస్యకు చాల మంది బాధపడుతుంటారు. మహిళల విషయంలో అయితే ఈ చుండ్రు సమస్య వస్తే.. అనేక రకాల షాంపులు వాడే వారున్నారు. అయితే అలా షాంపులాంటివి...

చుండ్రు సమస్యకు చాల మంది బాధపడుతుంటారు. మహిళల విషయంలో అయితే ఈ చుండ్రు సమస్య వస్తే.. అనేక రకాల షాంపులు వాడే వారున్నారు. అయితే అలా షాంపులాంటివి వాడకుండా.. ఆహార విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

చుండ్రు సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే తీపి పదార్థాలు పూర్తిగా మానెయ్యాలి అంటున్నారు నిపుణులు. డీప్‌ ఫ్రై చేసిన పదార్థాలకు దూరంగా ఉండాలి. వాటికి బదులుగా యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే తాజా పండ్లు, కూరగాయలు, నట్స్‌ తీసుకుంటే మంచి ఫలితం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒమెగా -3 ఫాటీ యాసిడ్లు ఉన్న చేపలు, అవిసె గింజలు తీసుకుంటే చుండ్రు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు అంటున్నారు నిపుణులు. జుట్టు ఆరోగ్యానికి ప్రొటీన్లతో పాటు ఐరన్‌, జింక్‌, సెలీనియం మొదలైన ఖనిజాలు ఉన్న ఆహారం అవసరం. విటమిన్‌ - డి లోపం, నిద్రలేమీ కూడా జుట్టు రాలడానికి కారణం అంటున్నారు నిపుణులు.

అలాగే ఆలివ్ ఆయిల్ మరియు పసుపు తో చుండ్రును నివారించవచ్చు అంటున్నారు నిపుణులు. కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ ను తీసుకొని, కొద్దిగా పసుపును కలిపి పేస్ట్ లా తయారు చేయాలి. ఈ పేస్ట్ ను తలపై చర్మానికి అప్లై చేసి, కొద్ది సమయం పాటు అలాగే ఉంచాలి. తరువాత నీటితో జుట్టును కడిగి వేయాలి. ఇలా చేయటం వల్ల చుండ్రును నివారించు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories