Lungs Health: మీ ఊపిరితిత్తులను శుభ్రపరిచే 7 మార్గాలు గురించి మీకు తెలుసా?

Lungs Health
x

Lungs Health: మీ ఊపిరితిత్తులను శుభ్రపరిచే 7 మార్గాలు గురించి మీకు తెలుసా?

Highlights

Lungs Health Tips: మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంతో ముఖ్యం. ప్రతిరోజు మనం శ్వాస తీసుకోవడానికి ఇవి కీలకపాత్ర పోషిస్తాయి.

Lungs Health Tips: మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంతో ముఖ్యం. ప్రతిరోజు మనం శ్వాస తీసుకోవడానికి ఇవి కీలకపాత్ర పోషిస్తాయి. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటేనే శ్వాస ఆడుతుంది. అయితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడితే ఊపిరితిత్తుల సామర్థ్యం కోల్పోయారని అర్థం. అయితే నిత్యం ఊపిరితిత్తులను శుభ్రపరిచే కొన్ని చిట్కాలు ఉన్నాయి. వాటి వల్ల అది ఆరోగ్యంగా ఉంటాయి.

ఊపిరితిత్తుల ఆరోగ్యంగా ఉండాలంటే మీరు ఎక్కువగా నీరు తీసుకోవడం ముఖ్యం. మీకు శ్లేష్మం ఎక్కువగా ఉంటే నీళ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల అది బయటికి పోతుంది. తద్వారా మీ శ్వాస ఊపిరితిత్తుల ఆరోగ్యంగా ఉంటాయి.

ఇది మాత్రమే కాదు తరచూ ఆవిరి పట్టుకోవడం అలవాటు చేసుకోండి. తద్వారా ఊపిరితిత్తుల శ్వాసనాళాలు పేరుకుపోయిన శ్లేష్మం బయటికి పోతుంది. తద్వారా శ్వాస ఆరోగ్యంగా ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆడుతుంది.

అప్పుడప్పుడు లోతైన శ్వాస వ్యాయామాలు చేయడం ఊపిరితిత్తులకు మంచిది. ఆక్సిజన్ లోపలికి పీల్చుకోవడం తర్వాత కాసేపు అలాగే ఉంచి మెల్లగా బయటకు వదలడం వంటి డీప్ శ్వాస పద్ధతులు పాటించాలి. ఇలా చేయడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది.

అంతేకాదు ప్రతిరోజు హెర్బల్‌ టీ తీసుకోవడం వల్ల కూడా ఊపిరితిత్తుల ఆరోగ్యంగా మారతాయి. శ్లేష్మం బయటకి వెళ్ళిపోతుంది.

ఇది మాత్రమే కాదు కొన్ని ఏరోబిక్ వ్యామోలు చేయడం వల్ల కూడా ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. ప్రధానంగా నడక, ఈత, సైక్లింగ్ వంటివి చేస్తే ఇది ఊపిరితిత్తులు శ్వాసనాళాలు వ్యాకోచిస్తాయి. ఇవి మాత్రమే కాదు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే పాలకూర, పసుపు, బెర్రీ జాతి పండ్లు తినాలి. తద్వారా ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. అయితే వాయు కాలుష్యం కూడా ఉపిరితిత్తుల ప్రమాదానికి కారణం అవుతుంది.

మీకు నిరంతరం దగ్గు వస్తే ఏ చిన్న పని చేసినా శ్వాస సరిగా ఆడకపోతే ఊపిరితిత్తులపై ఏదో ప్రభావం పడిందని అర్థం. ఛాతి బిగుతుగా అనిపించడం వంటివి కూడా ఊపిరితిత్తుల అనారోగ్యంగా ఉన్నాయని సంకేతం వెంటనే వైద్యులను సంప్రదించాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories