Watermelon: పుచ్చకాయ ను ఎలా ఎంపిక చేసుకోవాలి

How to Pick a Good Watermelon - Useful Tips
x

పుచ్చకాయ 

Highlights

Watermelon: కనీసం రెండు కిలోలు, అంతకంటే ఎక్కువ బరువు ఉండే పుచ్చకాయను ఎంచుకోవాలి.

Watermelon: అస్సలే ఎండలు మండుతున్నాయి. గొంతులో తడి ఆరిపోతోంది. ఈ సమయంలో మనకు గుర్తుకు వచ్చిది పుచ్చకాయ. మన శరీరానికి ప్రయోజనకరంగా ఉండే అత్యవసర ఖనిజాలు మరియు విటమిన్లను ఇది కలిగి ఉంటుంది. ఇవన్నీ కాకుండా, పుచ్చకాయ అనేది లైకోపీన్ అని పిలవబడే ఒక ఫైటోకెమికల్ యొక్క గొప్ప వనరు, ఇది పండు యొక్క ముదురు ఎరుపు రంగుకి బాధ్యత వహిస్తుంది. ఈ ఫైటోకెమికల్ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ పుచ్చకాయను కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు అవేంటే మన "లైఫ్ స్టైల్" లో చూద్దాం.

పుచ్చకాయని కోసి చూపిస్తే తప్ప అది లోపల ఎర్రగా ఉందో లేదో తెలియదు. అలాని కోసి చూపిస్తే ఒక దాన్ని మూడు నాలుగు గంటల్లోనే తినేయాలి. ఆలస్యం చేస్తే అది పాడై కుళ్లిపోతుంది.కనీసం రెండు కిలోలు, అంతకంటే ఎక్కువ బరువు ఉండే పుచ్చకాయను ఎంచుకోవాలి. అయితే పుచ్చకాయ ఏ రంగులో ఉన్నా పర్వాలేదు. పైన చారలు ఉన్నా, లేకపోయినా ఏమి కాదు. పుచ్చకాయ తొడిమ ఎండిపోయినట్లు ఉండాలి. తొడిమ లేకపోతే తొడిమ ఉండే ప్రాంతం గట్టిగా ఎండినట్లు ఉండాలి. అలాగే పుచ్చకాయ గట్టిగా, బరువుగా ఉండాలి. మెత్తగా ఉంటే అది లోపల పాడైనట్లు గుర్తించాలి. అలాగే కొన్ని పుచ్చకాయలపై గోధుమ లేదా పసుపు రంగు మచ్చలుంటాయి. చారలతో సంబంధం లేకుండా ఆ మచ్చలు దాదాపు గుండ్రంగా ఉంటాయి. మచ్చలు ఎంత ఎక్కువా ఉంటే ఆ పుచ్చకాయ లోపల అంత ఎర్రగా ఉంటుందని తెలుసుకోవాలి.

ఒక్కో వాటర్‌ మిలన్‌ పై ఒకటే మచ్చ ఉంటుంది. కొన్నింటికి రెండు, మూడు మచ్చలుంటాయి. ఎంత ఎర్రగా ఉంటే అంత ఎక్కువ పోషకాలు ఉంటాయి. పుచ్చకాయపై ఉండే తొడిమ ఎండిందో లేదో చూసుకోవాలి. అప్పుడు కట్‌ చేయకపోయినా లోపల మాత్రం ఎర్రగానే ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. కోసిన పుచ్చకాయని ఇంట్లో ఫ్రిడ్జ్‌లో లేదా ఎండ తగలని ప్రదేశంలో ఉంచినా పాడవదు. ఇలా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పుచ్చ కాయను కొనే ముందు ఇలాంటివి గమనిస్తూ తీసుకుంటే మరి మంచిదంటున్నారు. పుచ్చకాయన సాధ్యమైనంత వరకు ఫ్రిజ్ లో పెట్టకుండా వాడుకుంటే మంచి బెనిఫిట్స్ పొందవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories