‌Honey Benefits: తేనెను హెయిర్ కండిషనర్ గా వాడితే..?

‌Honey Benefits: తేనెను హెయిర్ కండిషనర్ గా వాడితే..?
x

హెయిర్ కండిషనర్ గా తేనె (ఫోటో పిక్సల్ బె)

Highlights

Honey Benefits: తేనె జుట్టుకు నేచురల్ కండిషనర్ గా ఉపయోగపడుతుంది.

Honey Benefits: ప్రకృతి లో సహజ సంపద పువ్వులు. ఆ పువ్వపైనా వాలి ఎంతో కష్టపడి మకరందంలోని తేనెను సేకరిస్తాయి తేనెటీగలు. ఇందులో వాటి శరీరం నుండి విడుదలయ్యే కొన్ని ఎంజైములు కూడా కలవడం వల్ల అది త్వరగా పాడవదు. ప్రత్యేకించి మన అందాన్ని, ఆరోగ్యన్ని కాపాడటంలో తేనెని మంచిన ఔషధం మరొకటి లేదు. ప్రత్యేకంగా జుట్టు ఆరోగ్యానికి తేనె ఒక వరం లాంటిదని చెప్పుకోవచ్చు. అది ఎలానో మన "లైఫ్ స్టైల్" లో చూద్దాం.

తేనెలో ఫ్రూట్ గ్లూకోజ్, ఐరన్, కాల్షియం, ఫాస్ఫేట్, సోడియం, క్లోరిన్, పొటాషియం, మెగ్నీషియం వంటి లక్షణాలు ఉన్నాయి. ఇవి బ్యాక్టీరియాల నుంచి మనల్ని రక్షించడంలో సహాయపడతాయి. తేనె లో యాంటిసెప్టిక్, యాంటీబయాటెక్, విటమిన్ బి 1, విటమిన్ బి 6 కూడా సమృద్ధిగా ఉంటాయి.

సాధారణంగా జుట్టుకు తేనె తగిలితే తెల్లబడుతుంది అని మన పెద్దలు అంటూవుంటారు. కాని అది ఓ అపోహ మాత్రమేనని నిపుణులు చెప్తున్నారు.తేనె జుట్టుకు నేచురల్ కండిషనర్ గా ఉపయోగపడుతుంది. తేనె, ఆలివ్ ఆయిల్ కలిపి జుట్టుకు పట్టించి అరగంట తర్వాత స్నానం చేయడం వల్ల జట్టు పట్టులా మెరుస్తుంది. తలస్నానం చేసే ముందు తేనె, పాలు కలిపి తలకు పట్టిస్తే జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా తయారవుతుంది.

మొటిమల మీద తేనె రాయడం వల్ల అవి త్వరగా తగ్గడంతో పాటు మచ్చలు చర్మపు రంగులో కలిసిపోతాయి. కాలిన గాయాలపై తేనెను పూయడం వల్ల మచ్చలు పడవు. పెదాలు పొడిబారకుండా చేస్తుంది. చర్మకాంతిని పెంచడమే కాకుండా చర్మంలో తేమ ఉండేలా చేసి మృదువుగా మారుస్తుంది. అంటే చక్కటి మాయిశ్చరైజర్ గా ఉపయోగపడుతుంది. మోచేతులు, మోకాళ్ల దగ్గర చర్మం నల్లగా వుంటే వాటిపై తేనెను పూయడం వల్ల ఈ నలుపు తగ్గి మృదువుగా మారుతుంది.

తేనె తీసుకుంటే లావవుతారని చాలా మంది భావిస్తూ వుంటారు. అది ఓ అపోహ మాత్రమే. తేనె తీసుకోవడం వల్ల శరీరంలోని కొవ్వు త్వరగా కరిగి త్వరగా సన్నబడతారు. తేనెలో వుండే కార్బోహైడ్రేట్ రక్తంలో కలిసే లక్షణం కలిగి వుండటం వల్ల త్వరగా శక్తిని అందిస్తుంది. మగవారిలో వీర్యకణాల సమస్యతో బాధపడేవారికి, ఆర్థరైటీస్, ఆస్తమా వంటి వ్యాధులతో బాధపడే వారికి తేనె మంచి ఔషధంగా పనిచేస్తుంది.

బి.పి, షుగర్ వ్యాధులతో బాధపడే వారు రోజూ ఒక స్పూన్ తేనె తీసుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు. జీర్ణ సమస్యలతో బాధపడే వారు కూడా తేనెను నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. రోజువారి మన ఆహారంలో తేనెను చేర్చుకుంటే అనేక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories