Lifestyle: మూత్రం ఆపుకుంటున్నారా.? ఎంత ప్ర‌మాద‌మో తెలుసా

Holding Urine Frequently
x

Lifestyle: మూత్రం ఆపుకుంటున్నారా.? ఎంత ప్ర‌మాద‌మో తెలుసా

Highlights

Holding Urine Frequently: కొన్నిసార్లు పరిస్థితులు అనుకూలించకపోతే మూత్రం ఆపుకుని ఉండాల్సి వస్తుంది. ప్రయాణాలు, సమావేశాలు, టాయిలెట్‌ సౌకర్యం లేకపోవడం వంటి సందర్భాల్లో ఇది జరుగుతుంది.

Holding Urine Frequently: కొన్నిసార్లు పరిస్థితులు అనుకూలించకపోతే మూత్రం ఆపుకుని ఉండాల్సి వస్తుంది. ప్రయాణాలు, సమావేశాలు, టాయిలెట్‌ సౌకర్యం లేకపోవడం వంటి సందర్భాల్లో ఇది జరుగుతుంది. కొంతమంది మాత్రం బద్ధకంతో కూడా మూత్రం వదలకుండా ఉండిపోతుంటారు. అయితే రెగ్యుల‌ర్‌గా మూత్రం ఉగ్గబట్టుకోవడం ఆరోగ్యానికి హానికరమ‌ని నిపుణులు చెబుతున్నారు.

వైద్య నిపుణుల ప్రకారం, దీని వల్ల కిడ్నీలు, లైంగిక ఆరోగ్యం, మెదడు పని తీరు తదితర అంశాలపై ప్రభావం పడుతుంది. మూత్రంలో నీరుతో పాటు, యూరియా, సోడియం, క్యాల్షియం, పొటాషియం లాంటి మినరల్స్‌ కూడా ఉంటాయి. ఎక్కువసేపు మూత్రాన్ని ఆపితే, అందులోని క్యాల్షియం కిడ్నీలో పేరుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఇలా కొనసాగితే కిడ్నీలో రాళ్లు ఏర్పడవచ్చు.

కిడ్నీలు రోజూ సుమారు 180 లీటర్ల నీటిని వడపోసే పనిలో ఉంటాయి. కానీ మూత్రం ఉగ్గబట్టుకోవడం వల్ల వాటి పనితీరు మందగిస్తుంది. దీనివల్ల రక్తంలో ఇన్ఫెక్షన్‌ వచ్చే ప్రమాదం కూడా ఉంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మూత్రాశయాన్ని నియంత్రించే పల్విక్‌ కండరాలపై ఒత్తిడి పెరుగుతుంది. దీర్ఘకాలంగా ఇలా జరుగుతూ ఉంటే ఈ కండరాలు బలహీనపడతాయి. ఇది లైంగిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. శరీరం నుంచి వచ్చే సహజ సంకేతాలను మనం నిర్లక్ష్యం చేసినట్లవుతుంది. దీని వల్ల మెదడు పంపే సంకేతాలను అర్థం చేసుకునే శక్తి తగ్గుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories