
చాలా మంది ఎండు రొయ్యలు తినడానికి ఇష్టపడరు..అవి వాసన వస్తాయని తినరు. కానీ ఎండు రొయ్యల్లో ఉండే రుచే వేరు.. స్మెల్ అస్సలు రాకుండా చింతపండు పులుసుతో...
చాలా మంది ఎండు రొయ్యలు తినడానికి ఇష్టపడరు..అవి వాసన వస్తాయని తినరు. కానీ ఎండు రొయ్యల్లో ఉండే రుచే వేరు.. స్మెల్ అస్సలు రాకుండా చింతపండు పులుసుతో చేసుకునే కూర టేస్ట్ చూస్తే అస్సలు వదలు.. మరి ఈ ఎండు రొయ్యల కూర ఎలా చేస్తారో తెలుసుకుందాం... పదండి.
కావాల్సిన పదార్ధాలు :
*ఎండు రొయ్యలు
*చింతపండు
*మెంతులు
*జీలకర్ర
*కరివేపాకు
*పసుపు
*ఉల్లిపాయలు
*వెల్లుల్లి రెబ్బలు
*కారం
*దనియాలు
*కొత్తిమీర
*ఉప్పు
తయారీ విధానం :
ముందుగా నిమ్మకాయ సైజంత చింతపండును తీసుకుని కడిగి 30 నిమిషాల పాటు నీటిలో నానబెట్టుకోవాలి. చింతపండు నానేలోపు ఇప్పుడు ఎండురొయ్యలను తీసుకుని దాని తలలు, కాళ్లు, చేతులను తీసి శుభ్రం చేసుకోవాలి. అన్ని రొయ్యలను నీట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలను 2, 3 ఉల్లిపాయలను కట్ చేసుకోవాలి..ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి
స్టవ్ మీద పాన్ పెట్టి అందులోకి పావు టీస్పూన్ మెంతులు, అరటీస్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి . దీనిని పొడి చేసి పెట్టుకోవాలి..ఈ పొడి కూరలో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే పాన్‌లో ఎండురొయ్యలను డ్రై రోస్ట్ చేసుకోవాలి. ప్రై అయిన రొయ్యలను గిన్నెలోకి తీసుకుని 2 మూడు నిమిషాలు నీటిలో నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల రొయ్యలు వాసన రావు,
ఇప్పుడు మరో కడాయి తీసుకుని అందులో నూనె పోయాలి...నూనె కాస్త కాగాక చిటికెడు మెంతులు, అరటీస్పూన్ జీలకర్ర , కరివేపాకు వేసి వేపుకోవాలి..ఉల్లిపాయలు కూడా వేయాలి...లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి...ఇప్పుడు కాస్త ఉప్పు వేసుకోవాలి.వెల్లుల్లి రెబ్బలను దంచి వేసుకోవాలి...ఇప్పుడు ఎండు రొయ్యలను కడిగి తీసుకుందాం...వీటిని కూడా ఉల్లిపాయలతో వేసి వేపుకోవాలి. పావు టీస్పూన్ పసుపు , రెండు టీస్పూన్ ల కారం వేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన చింతపండు పులుసును వేసుకుందాం. ఇది ఉడికే కొద్దీ కాస్త దగ్గర పడుతుంది..గ్రేవీగా ఉంటనే కూర టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి 4 నిమిషాలు మగ్గనివ్వాలి. మూత తీసి
ఇప్పుడు వేయించిన జీలకర్ర, మెంతులు పొడిని ఇందులో వేసుకుందాం...కూరను బాగా కలుపుకోవాలి...మరో 3 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. నూనె పైకి తేలే వరకు చూడాలి. ఇప్పుడు కొత్తిమీర, దనియాల పొడి వేయండి. టేస్టీ ఎండు రొయ్యల కూర రెడీ.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



