అధిక యూరిక్‌ యాసిడ్‌ చాలా ప్రమాదం.. నియంత్రించకపోతే ఈ సమస్యలు..!

High Uric Acid Makes Bones Hollow Control it by Eating These Foods
x

అధిక యూరిక్‌ యాసిడ్‌ చాలా ప్రమాదం.. నియంత్రించకపోతే ఈ సమస్యలు..!

Highlights

Uric Acid: ఈ రోజుల్లో యూరిక్ యాసిడ్ సమస్య సర్వసాధారణమైపోయింది.

Uric Acid: ఈ రోజుల్లో యూరిక్ యాసిడ్ సమస్య సర్వసాధారణమైపోయింది. యూరిక్ యాసిడ్ అంటే మన రక్తంలో పేరుకుపోయిన ఒక మురికిలాంటి పదార్థం. శరీరం ప్యూరిన్ అనే రసాయనాన్ని విచ్ఛిన్నం చేసినప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. చాలా సందర్భాలలో యూరిక్ యాసిడ్ రక్తంలో కలిసిపోతుంది. కొన్నిసార్లు మూత్రం ద్వారా బయటికి వెళ్లిపోతుంది. ప్యూరిన్స్ ఉన్న ఆహారాలు అధికంగా తీసుకుంటే శరీరంలో యూరిక్ యాసిడ్ పరిమాణం పెరుగుతుంది. దీని గురించి తెలుసుకుందాం.

యూరిక్ యాసిడ్ వల్ల ఈ సమస్యలు

శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగితే హైపర్ యూరిసెమియా అనే వ్యాధిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ వ్యాధిలో యూరిక్ యాసిడ్ స్ఫటికాల రూపాన్ని తీసుకుంటుంది. ఈ స్ఫటికాలు కీళ్ళలో స్థిరపడతాయి. ఇది ఆర్థరైటిస్ సమస్యకు దారితీస్తుంది. ఈ స్ఫటికాలు కిడ్నీలో స్థిరపడితే కిడ్నీ స్టోన్ సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

కీళ్ళు, కణజాలాలు దెబ్బతింటాయి..

యూరిక్ యాసిడ్‌కి సకాలంలో చికిత్స తీసుకోవాలి. ఎందుకంటే దాని పెరిగిన స్థాయి ఎముకలు, కీళ్ళు, కణజాలాలకు నష్టం కలిగిస్తుంది. యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల చాలా సార్లు కిడ్నీ, గుండె జబ్బులు ఎదురవుతాయి. సరైన జీవనశైలిని అనుసరించడం ద్వారా యూరిక్ యాసిడ్ తగ్గించవచ్చు.

ఈ ఆహారాలను తక్కువగా తినాలి..

యూరిక్ యాసిడ్ తగ్గించడానికి తక్కువ కొవ్వు ఉత్పత్తులను తీసుకోవాలి. ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారు తక్కువ కొవ్వు పదార్థాలను తినాలని అనేక పరిశోధనలో తేలింది. అంతే కాకుండా చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటిని ఆహారంలో చేర్చుకోవడం మంచిది. కొన్ని సీఫుడ్‌లలో అధిక మొత్తంలో ప్యూరిన్‌లు ఉంటాయి. కాబట్టి వారికి దూరంగా ఉంటే మేలు.

Show Full Article
Print Article
Next Story
More Stories