Heart Health: ఈ 8 ఆహారాలు గుండెకు రక్షణ.. ఇది ఆరోగ్య నిపుణులు సూచన..!

Heart Healthy 8 Foods That Protect Your Heart life time Expert Recommendations
x

Heart Health: ఈ 8 ఆహారాలు గుండెకు రక్షణ.. ఇది ఆరోగ్య నిపుణులు సూచన..!

Highlights

Heart Healthy Foods: ఈ కాలంలో హార్ట్‌ అటాక్‌ సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. చిన్నవయస్సులోనే ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో గుండె బలంగా ఉండాలంటే కొన్ని ఆహారాలు మీ డైట్‌లో ఉండాలి.

Heart Healthy Foods: మన జీవనశైలి బాగుంటేనే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రెగ్యులర్‌ ఎక్సర్‌సైజ్‌తోపాటు డైట్‌ కూడా కీలకం. అయితే కొన్ని ఆహారాలు గుండెకు రక్షణ కవచంలా నిత్యం కాపాడుతాయట. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ ఆహారాలు ప్రధానంగా మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గించేస్తాయి. దీంతో హార్ట్‌ అటాక్ సమస్య రాదు. అంతేకాదు వీటిలో ఖనిజాలు పుష్కలం ఇది మీ గుండెను బలంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఆలివ్‌ ఆయిల్‌..

ఇది మన డైట్‌లో కచ్చితంగా ఉండాల్సిందే. ప్రధానంగా ఎక్ట్ర్సా వర్జిన్‌ ఆలివ్‌ ఆయిల్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమై కొవ్వులు ఉంటాయి. ఇది మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించేస్తుంది.దీంత కార్డియో ఆరోగ్యం బాగుంటుంది. గుండె సమస్యలు మీ దరిచేరకుండా ఉంటాయి.

అవకాడో..

అవకాడోలో మోనోఅన్‌శాచురేటెడ్‌ కొవ్వులు ఉంటాయి. అంతేకాదు అవకాడోలో పొటాషియం ఉంటుంది. ఇది కూడా శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ తగ్గిస్తుంద. రక్తపోటను నియంత్రణలో ఉంచుతుంది. తద్వారా గుండె పోటు సమస్య కూడా తక్కువగా ఉంటాయి. అవకాడో మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ స్థాయిలను సైతం పెంచుతాయి.

డార్క్‌ చాకొలేట్‌..

ఇందులో ఫ్లేవనాయిడ్స్‌ పుష్కలం. కోకోవా శాతం అధికంగా ఉండే డార్క్‌ చాకొలేట్‌లు మాత్రమే తినండి. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం. అంతేకాదు రక్తసరఫరాను సైతం మెరుగు చేస్తుంది. డార్క్‌ చాకొలేట్స్‌ రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.

వెల్లుల్లి..

వెల్లుల్లిలో అల్లిసిన్‌ ఉంటుంది. గత వందల ఏళ్లుగా దీన్ని వినియోగిస్తారు. ఇందులో ఔషధ గుణాలు ఉంటాయి. వెల్లుల్లి కూడా రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ తగ్గిస్తుంది. ఇది రక్తసరఫరాను పెంచి గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

ఆకుకూరలు..

ఆకుకూరల్లో విటమిన్స్‌, మినరల్స్‌ ఉంటాయి. వీటిని తరచూ తినాలని ఆరోగ్య నిపుణులు కూడా సూచిస్తారు. ప్రధానంగా పాలకూర, కాలే వంటి ఆకుకూరలు తినాలి. ఇవి బీపీని కూడా తగ్గిస్తాయి. అంతేకాదు గుండె పోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

బెర్రీ పండ్లు..

బెర్రీ జాతికి చెందిన పండ్లు తరచూ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, రాస్బెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది ఆక్సిడేటీవ్‌ స్ట్రెస్ తగ్గిస్తాయి. కార్డియో ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

సాల్మాన్‌..

సాధారణంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి. సాల్మాన్‌ చేప చెడు కొలెస్ట్రాల్‌ తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. వారంలో రెండుసార్లు ఈ చేప తినాలి. దీంతో మీ గుండె దృఢంగా మారి పనితీరు కూడా మెరుగు చేస్తుంది.

వాల్‌నట్స్..

ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వాల్‌నట్స్‌లో ఉండే ఫైబర్‌ గుండె పనితీరును మెరుగు చేస్తుంది. ప్రతిరోజూ నానబెట్టిన వాల్‌నట్స్‌ తింటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ నిర్వహిస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories