Heart Health: భవిష్యత్తులో గుండెపోటు రావొద్దంటే.. ఈరోజు నుంచే ఇలా చేయండి

Health tips to avoid heart problems in future
x

Heart Health: భవిష్యత్తులో గుండెపోటు రావొద్దంటే.. ఈరోజు నుంచే ఇలా చేయండి

Highlights

ప్రపంచవ్యాప్తంగా మరణాలకు కారణమవుతోన్న అనారోగ్య సమస్యల్లో గుండెపోటు ఒకటి. మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా ఇటీవల చాలా మంది...

ప్రపంచవ్యాప్తంగా మరణాలకు కారణమవుతోన్న అనారోగ్య సమస్యల్లో గుండెపోటు ఒకటి. మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా ఇటీవల చాలా మంది గుండెపోటు బారిన పడుతున్నారు. గతంలో వయసు మళ్లిన వారిలో మాత్రమే కనిపించిన ఈ సమస్య ప్రస్తుతం యువతలోనూ ఎక్కువవుతోంది. అయితే గుండెపోటు రాకుండా ఉండాలన్నా, గుండె ఆరోగ్యంగా ఉండాలన్నా జీవన విధానంలో కొన్ని మార్పులతో పాటు తీసుకునే ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఉప్పును తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉప్పు కారణంగానే అధిక రక్తపోటు వస్తుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రాసెస్‌ చేసిన ఆహారం, ప్యాకేజ్‌డ్‌ ఫుడ్‌లో ఉప్పు కంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకుంటే గుండె సమస్యలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

* ప్రతీరోజూ కచ్చితంగా కొంత సమయం వ్యాయామం కోసం కేటాయించాలి. కనీసం వాకింగ్‌, యోగా, మెడిటేషన్‌ వంటి వాటిని అలవాటు చేసుకోవాలి. ప్రకృతిలో కాసేపైనా నడవాలని సూచిస్తున్నారు.

* భవిష్యత్తులో గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. వీటిలోని విటమిన్లు, మినరల్స్‌, ఫైబర్‌ కంటెంట్‌ గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉపయోగపడతాయి. రోజుకు ఒక పండునైనా తీసుకోవాలి.

* తీసుకునే ఆహారంలో అల్లం, వెల్లుల్లి కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. వెల్లుల్లి రక్తపోటును తగ్గించడంతో పాటు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. అల్లం రక్తం గడ్డకట్టడాన్ని నివారించి శరీరంలోని వాపును తగ్గిస్తుంది.

* వీటన్నింటితో పాటు మంచి నిద్ర కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. ప్రతీ రోజూ కనీసం 7 నుంచి 8 గంటల నాణ్యమైన నిద్ర తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. దీంతో మానసిక ఆందోళన తగ్గుతుంది.

* గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఒత్తిడిని తగ్గించుకునే విధానాలను పాటించాలి. ముఖ్యంగా యోగా, మెడిటేషన్‌ వంటి వాటిని అలవాటు చేసుకోవాలి. మనసులో సానుకూల దృక్పథాన్ని పెంచుకోవాలి.

Note: ఈ వివరాలు కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలైనా వైద్యులను సంప్రదించే తీసుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories