Health Tips: పారాసెటమాల్ ఎక్కువగా తీసుకుంటున్నారా.. అయితే ప్రమాదంలో పడ్డట్లే..!

Health Tips: పారాసెటమాల్ ఎక్కువగా తీసుకుంటున్నారా.. అయితే ప్రమాదంలో పడ్డట్లే..!
Paracetamol: భారతదేశంలో చాలా మంది పారాసెటమాల్ వాడతారు. ఈ కోవిడ్ యుగంలో జ్వరం, శరీర నొప్పి లాంటి వాటి నుంచి ఉపశమనం కోసం పారాసెటమాల్ టాబ్లెట్ తీసుకుంటుంటారు.
Health Tips: భారతదేశంలో చాలా మంది పారాసెటమాల్ వాడుతుంటారు. ఈ కోవిడ్ యుగంలో, చాలా మంది ప్రజలు జ్వరం, శరీర నొప్పుల నుంచి ఉపశమనం కోసం పారాసెటమాల్ టాబ్లెట్ తీసుకుంటారు. కొంచెం తలనొప్పి లేదా తేలికపాటి జ్వరం ఉంటే, ప్రజలు ప్రతిదానిలో కాల్పోల్, క్రోసిన్, డోలో వంటి పారాసెటమాల్ మందులను తీసుకుంటారు. కానీ, చాలా మందికి దాని ఖచ్చితమైన పరిమాణం గురించి తెలియదు. పారాసెటమాల్ స్టెరాయిడ్లను కలిగి ఉంటుంది. అయితే దీనిని సరైన మోతాదులో తీసుకోకుంటే మాత్రం ఎంతో హాని కలిగిస్తుంది. పారాసెటమాల్ సాధారణంగా జ్వరం, మైగ్రేన్, పీరియడ్స్ నొప్పి, తలనొప్పి, పంటి నొప్పి, శరీర నొప్పి వంటి పరిస్థితులలో ఉపయోగిస్తుంటారు. ఇది కాల్పోల్, క్రోసిన్, డోలో, సుమో ఎల్, కబిమోల్, పాసిమోల్ వంటి అనేక పేర్లతో మందుల దుకాణాలలో దొరుకుతుంది.
సరైన ఔషధ మోతాదును తెలుసుకోండి..
Drugs.com ప్రకారం, పెద్దలకు జ్వరం ఉంటే అమెరికన్ మార్గదర్శకం ప్రకారం, 325 mg నుంచి 650 mg పారాసెటమాల్ మోతాదు 4 నుంచి 6 గంటల వ్యవధిలో ఇస్తుంటారు. విరామం 8 గంటల వరకు ఉంటే వారికి 1000 mg వరకు మందులు ఇవ్వవచ్చు. అయితే వ్యక్తిలో గతంలో ఉన్న వ్యాధులు, బరువు, ఎత్తు, వాతావరణం ఆధారంగా కూడా మోతాదును నిర్ణయిస్తారు. మార్గదర్శకాల మేరకు జ్వరం వచ్చిన 6 గంటల తర్వాత మాత్రమే 500 mg పారాసెటమాల్ తీసుకోవాలి. చిన్నపిల్లలకు పారాసెటమాల్ ఇచ్చేటపుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకి జ్వరం, ఒక నెల కంటే తక్కువ వయస్సు ఉన్నట్లయితే, 4 నుంచి 6 గంటల వ్యవధిలో ఒక కిలో బరువుకు 10 నుంచి 15 mg పారాసెటమాల్ ఇవ్వాలి. అదే పరిమాణంలో 6 నుంచి 8 గంటల వ్యవధిలో 12 సంవత్సరాల పిల్లలకు ఇవ్వాలి.
18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి శరీరంలో నొప్పి ఉన్నట్లయితే, 325 నుంచి 650 mg పారాసెటమాల్ ఔషధాన్ని 4 నుంచి 6 గంటల వ్యవధిలో తీసుకోవాలి. 1000 mg ఔషధం 6 నుంచి 8 గంటల విరామంతో తీసుకోవాలి. నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి 4 నుంచి 6 గంటల వ్యవధిలో 500 మి.గ్రా మందు తీసుకోవాలి. మరోవైపు, ఒక చిన్న పిల్లవాడు 6 నుంచి 8 గంటల మధ్య శరీర బరువు కిలోకు 10 నుంచి 15 mg తీసుకోవాలి.
పారాసెటమాల్ ఎప్పుడు తీసుకోకూడదంటే?
నిపుణుల అభిప్రాయం ప్రకారం, మీరు జ్వరంతో మూడు రోజులు పారాసెటమాల్ మందులు తీసుకుంటూ జ్వరం తగ్గకపోతే, వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. ఎలాంటి నొప్పి వచ్చినా 10 రోజులకు మించి పారాసెటమాల్ తీసుకోకూడదు. అంతే కాకుండా కాలేయ సమస్య, కిడ్నీ సమస్య, ఆల్కహాల్ సమస్య, బరువు తక్కువగా ఉన్న సందర్భాల్లో వైద్యుల సలహా లేకుండా పారాసిటమాల్ తీసుకోకూడదు.
Paracetamol (పారాసెటమాల్) అధిక మోతాదుతో దుష్ప్రభావాలు..
పారాసెటమాల్‌ను అధిక మోతాదులో తీసుకుంటే కొన్నిసార్లు దుష్ప్రభావాలకు కూడా కారణం కావచ్చు. అలెర్జీలు, చర్మంపై దద్దుర్లు, రక్త రుగ్మతలు వంటి సమస్యలు ఉండవచ్చు. ఇది కాకుండా, పారాసెటమాల్‌ను తప్పుగా ఉపయోగించడం వల్ల కాలేయం, మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. పారాసెమాల్‌ను ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల విరేచనాలు, విపరీతమైన చెమటలు పట్టడం, ఆకలి లేకపోవటం, విశ్రాంతి లేకపోవటం, వాంతులు, కడుపునొప్పి, ఉబ్బరం, నొప్పి, పొత్తికడుపు, తిమ్మిర్లు వంటి కింది సమస్యలలో ఒకదానికి దారితీయవచ్చు.
గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులు కేవలం సూచనలుగా మాత్రమే తీసుకోండి. అటువంటి చికిత్స/మందు/ఆహారం అనుసరించే ముందు డాక్టర్‌ని సంప్రదించండి.
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్‌కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
Hyderabad: హైదరాబాద్ గచ్చిబౌలి పీఎస్ పరిధిలో దారుణం
29 May 2022 12:09 PM GMTRussia: శక్తివంతమైన క్షిపణని ప్రయోగించిన రష్యా
29 May 2022 11:49 AM GMTNorth Korea: కరోనాను కంట్రోల్ చేసిన కిమ్
29 May 2022 11:21 AM GMTYV Subba Reddy: తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనం అయ్యే వరకు ఓపికతో...
29 May 2022 10:59 AM GMTAxis Bank: యాక్సిస్ బ్యాంక్ ఖాతాదారులకి బ్యాడ్‌న్యూస్.. జూన్ 1...
29 May 2022 10:30 AM GMT