Omicron Diet: కోవిడ్-19 నుంచి త్వరగా కోలుకోవాలంటే.. డైట్‌లో ఇవి చేర్చండి..!

Omicron Diet: కోవిడ్-19 నుంచి త్వరగా కోలుకోవాలంటే.. డైట్‌లో ఇవి చేర్చండి..!
దేశంలో కరోనా వైరస్ మరోసారి విపరీతంగా విస్తరిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కోవిడ్-19 నుంచి కోలుకోవడానికి డైట్‌లో ఏం చేర్చుకోవాలో ఇప్పుడు చూద్దాం..
Health Care Tips: దేశంలో కరోనా వైరస్ మరోసారి విస్తరిస్తోంది. కోవిడ్ -19 కేసులు మళ్లీ పెరుగుతుండటంతో భారతదేశం మూడో వేవ్‌లోకి ప్రవేశించింది. అదే సమయంలో, చాలా మంది కరోనావైరస్ కొత్త వేరియంట్, ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడుతున్నారు. అయితే ఒమిక్రాన్ చాలా ప్రమాదకరమైనది మాత్రం కాదని నిరూపణ అయింది. మరోవైపు, మీరు కూడా కరోనావైరస్ బారిన పడినట్లయితే, కోవిడ్ -19 నుంచి కోలుకోవడానికి, మీ ఆహారంలో కొన్ని అంశాలను చేర్చుకోవాలి. అటువంటి పరిస్థితిలో, కోవిడ్-19 నుంచి కోలుకోవడానికి మీ ఆహారంలో ఏయే అంశాలను చేర్చుకోవాలో ఇప్పుడు చూద్దాం.
మొక్కల ఆధారిత ఆహారాలు..
మొక్కల ఆధారిత ఆహారాలలో పోషకాలు అధికంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. ప్రతిరోజూ మొక్కల ఆహారాన్ని తీసుకునే వ్యక్తులు కోవిడ్-19 బారిన పడే అవకాశం 40 శాతం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆకుకూరల్లో విటమిన్ ఏ, బీ6, బీ12 పుష్కలంగా ఉంటాయి. ఇది కాకుండా, విత్తనాలు, గింజలు ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఈ, ఐరాన్‌లకు అద్భుతమైన మూలాలు.
సుగంధ ద్రవ్యాలు, మూలికలు చేర్చుకోండి: కరోనావైరస్ అత్యంత సాధారణ లక్షణాలలో ఒకటి మీ రుచి లేదా వాసనలో మార్పు. మీ ఆహారంలో వెల్లుల్లి, అల్లం, పసుపు, దాల్చినచెక్క మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చాలి. ఇది మీ ఆహారం రుచిని మెరుగుపరచడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది.
తగినంత ప్రోటీన్, కేలరీలు తీసుకోండి: మీకు కోవిడ్-19 ఉంటే, వైరస్‌తో పోరాడటానికి మీ శరీరానికి తగినంత శక్తి అవసరం. ఇలాంటి పరిస్థితిలో, మీరు మీ ఆహారంలో గుడ్లు, చేపలు, బీన్స్ వంటి ప్రోటీన్ అధికంగా ఉండే వాటిని చేర్చుకోవాలి.
గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులను కేవలం సూచనలుగా మాత్రమే తీసుకోండి. ఇటువంటి వాటిని చికిత్స/మందు/ఆహారంగా తీసుకోవాలంటే ముందుగా డాక్టర్‌ని సంప్రదించండి.
యమునోత్రి వెళ్లే దారిలో కూలిన రక్షణ గోడ.. రోడ్డుపైనే చిక్కుకున్న 10వేల మంది..
21 May 2022 12:45 PM GMTఎలాన్ మస్క్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. యువతికి 2.50 లక్షల డాలర్లు చెల్లించి..
20 May 2022 2:30 PM GMTAfghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMT
Peddireddy: ఏపీలో పవర్ హాలిడే ఎత్తివేశాం.. వారి పిచ్చికి మందులేదని..
21 May 2022 4:00 PM GMTVishwak Sen: రెమ్యూనరేషన్ తో నిర్మాతలకు షాక్ ఇస్తున్న విశ్వక్ సేన్
21 May 2022 3:30 PM GMTEtela Rajender: మోడీకి ముఖం చూపలేకే ఢిల్లీ పారిపోయారు..
21 May 2022 3:15 PM GMTMarried Men: పెళ్లైన పురుషులకి ఇది సూపర్ ఫుడ్.. అదేంటంటే..?
21 May 2022 3:00 PM GMTగ్యాస్ ధర రూ.200 తగ్గింపు.. దేశంలో భారీగా తగ్గనున్న సిమెంట్,...
21 May 2022 2:17 PM GMT