అమ్మాయిలూ ఫోన్ ఇలా మాట్లాడుతున్నారా?

అమ్మాయిలూ ఫోన్ ఇలా మాట్లాడుతున్నారా?
x
Highlights

స్మార్ట్ ఫొన్.. ఇది చాలా మందికి అంత్యత ఆవశ్యకమైన వస్తువుగా మారిపోయింది. మనిషి కమ్యూనికేషన్ నేరుగా కంటే ఫోన్ ద్వారానే సాగిపోతోంది. ఒకప్పుడు అవసరం...

స్మార్ట్ ఫొన్.. ఇది చాలా మందికి అంత్యత ఆవశ్యకమైన వస్తువుగా మారిపోయింది. మనిషి కమ్యూనికేషన్ నేరుగా కంటే ఫోన్ ద్వారానే సాగిపోతోంది. ఒకప్పుడు అవసరం ఉండేది ఇప్పుడు సౌఖర్యంగా మారిపోయింది. అయితే కొత్త పుంతలు తోక్కుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఎంతటి లాభం ఉందో అంతే చిక్కుల్నీ కూడా సృష్టిస్తోంది. మరి ముఖ్యంగా స్ట్మార్ట్ ఫోన్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహారించకపోతే అమ్మాయిలు ఇబ్బందుల్లో పడక తప్పదు. స్పై యాప్‌లు, కెమెరాలు...వీడియో కాలింగ్‌, ఆడియో రికార్డింగ్‌.. వంటి ఫీచర్స్ సరిగా వాడుకోకపోతే అమ్మాయిలకు కష్టాలు తప్పవు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు పడకుండా ఉండవచ్చు.

అమ్మాయిలు మెబైల్ వాడడం చూసి చాలా మంది తల్లిదండ్రులు వారితో వారిస్తుంటారు. పేరెంట్స్ స్వేచ్ఛని హరిస్తున్నారని భావనలో వారుంటారు. వాళ్ళు అలా హెచ్చరిస్తున్నారంటే మీరు పరిధి దాటుతున్నారనే విషయాన్ని అర్ధం చేసుకోవాలి. అది వినిపించికోండి దాని మాయలో మీరు పడిపోతే.. ఆగంతకుల విసిరే వలకు మీరు చిక్కుకునే ప్రమాదం ఉంది. అతిగా ఫోన్‌ను వాడడం తగ్గించి కుటుంబ సభ్యులతో ఎక్కువ సేపు గడపండి. అప్పడు మీ అమ్మానాన్నలు మిమ్మల్ని నమ్ముతారు.

స్మార్ట్‌ఫోన్ల పుణ్యమాని కొత్త పరిచయాలు మెుదలైయి వారితో గంటల తరబడి సంభాషణ జరుపుతూ అమ్మాయిలు వారి వలలో చిక్కుకుంటున్నారు. అవతలివారు ఎంత సన్నిహితులు అయినప్పటికీ వారికి వ్యక్తిగత ఫొటోలు పంపడం, ఇతరులతో వీడియో కాల్స్‌ మాట్లాడుతున్నప్పడు వారు చేయమన్నది చేయకూడదు. వీడియో కాల్స్ మాట్లాడేటప్పుడు శరీర భాగాలు కనిపించేలా దుస్తులు వేసుకోకూడదు. అవి మీరు ఇద్దరి మధ్యే ఉంటాయని అనుకోకూడదు సాంకేతిక ప్రపంచం విసృత్తమైనది కావున

అది ఎవరి చేతికైనా చేరొచ్చు. ప్రతి యాప్ డౌన్‌లోడ్‌ చేసుకుని వాటికి ఎడాపెడా అనుమతులు ఇవ్వడం మంచిదికాదు. దీనివల్ల మీకు తెలియకుండానే మీ ఫోన్‌లో ఉన్న వ్యక్తి సమాచారం మరొక్కరి చేతికి చిక్కోచ్చు. కావున సురక్షితమైన యాప్‌లను వాడడం మాత్రమే మంచిది. రోజురోజుకీ సోషల్ మీడియాకు అంకితమైపోతున్నారు చాలా మంది అమ్మాయిలు.మినిట్ టూ మినిట్ వాట్సప్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో సమచారాన్ని అప్‌డేట్స్ షేర్ చేస్తూ కాలం గడుపుతున్నారు గర్ల్స్. ఇలా అప్‌డేట్స్ ఇవ్వడం వల్ల అనర్థాలకు గురవుతూ తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్తున్నారంటున్నారు పరిశోధనలు.. సో అమ్మాయిలు బీ కేర్ పుల్. స్మార్ట్ ఫోన్ రివాల్యుషన్ ఊబిలోకి దిగోద్దు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories