ప్రస్తుత కాలంలో ఈ జాగ్రత్తలు పాటించాలి..!

ప్రస్తుత కాలంలో ఈ జాగ్రత్తలు పాటించాలి..!
x
Highlights

ఒకవైపు కుండపోత వర్షాలు.. బయటకు వెళ్లాలంటే మోకాళ్ల లోతు నీళ్లు.. ఆ నీళ్లలో వెళ్లితే వ్యాధులు వస్తాయనే భయం కొంతమందిని వెంటాడుతుంటే.. మరో వైపు జలుబు,...

ఒకవైపు కుండపోత వర్షాలు.. బయటకు వెళ్లాలంటే మోకాళ్ల లోతు నీళ్లు.. ఆ నీళ్లలో వెళ్లితే వ్యాధులు వస్తాయనే భయం కొంతమందిని వెంటాడుతుంటే.. మరో వైపు జలుబు, గొంతు పొడిబారడం వంటి సమస్యలు మరికొంతమందిని బాధిస్తున్నాయి. వీటి బారిన పడకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా పోషకాహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం అంటున్నారు. కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే.. ఫిట్‌గా ఉంటూ రెయినీ డేను ఎంజాయ్‌ చేయవచ్చు అంటున్నారు నిపుణులు.

ముఖ్యంగా హెర్బల్ టీ హానికర బ్యాక్టీరియాను తొలగిస్తాయి అంటున్నారు నిపుణులు. వర్షం పడుతున్న సాయంత్రం వేడివేడిగా హెర్బల్‌ టీ తీసుకుంటే ఆ మజానే వేరు. ఇలా చేయడం వల్ల ప్రకృతిని ఆస్వాదించడంతో పాటు.. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అంటున్నారు ఆరోగ్యనిపుణులు.

కాజూ, వాల్‌నట్‌, బాదం, ఖర్జూరం వంటివి ఈ సీజన్‌లో ఆరోగ్యానికి మేలు చేస్తాయి అంటున్నారు. ఇవి శరీరాన్ని వెచ్చగా ఉంచి, వ్యాధులకు కారణమయ్యే వైరస్‌ల నుంచి మనకు రక్షణగా ఉంటాయి. ఇక పసుపు, నల్లమిరియాలు, అల్లం, దాల్చినచెక్క వంటి వాటిని ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. వీటిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే.. భోజనం త్వరగా జీర్ణమయ్యేందుకు తోడ్పడుతాయి అంటున్నారు ఆరోగ్యనిపుణులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories