Health Tips: ఈ 5 చెడు అలవాట్లతో ఎముకలకి పెద్ద ఎదురుదెబ్బ.. తెలుసుకోపోతే చాలా నష్టపోతారు..!

Health Tips bones weaken with these 5 Bad Habits | 5 Unhealthy Habits
x

Health Tips: ఈ 5 చెడు అలవాట్లతో ఎముకలకి పెద్ద ఎదురుదెబ్బ.. తెలుసుకోపోతే చాలా నష్టపోతారు..!

Highlights

Health Tips: ఆధునిక జీవితంలో బిజీగా ఉండటం వల్ల చాలామంది ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదు...

Health Tips: ఆధునిక జీవితంలో బిజీగా ఉండటం వల్ల చాలామంది ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదు. మనం నిత్య జీవితంలో చేసే కొన్ని తప్పుల వల్లే ఆరోగ్యం దెబ్బతింటుంది. అందులో ముఖ్యంగా చెడ్డ అలవాట్ల వల్ల ఎముకలు బలహీనమవుతున్నాయి. కానీ దీని గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఇది దీర్ఘకాలంలో పెద్ద సమస్యగా మారుతుంది. కొన్ని అలవాట్లని మానేస్తే ఆరోగ్యానికి మంచిది. అలాంటి వాటి గురించి తెలుసుకుందాం.

1. లేజీ లైఫ్ స్టైల్

ఎముకలు బలహీనపడటానికి కారణం లేజీనెస్‌. మీరు వ్యాయామం చేయడం, నడవడం తగ్గించినట్లయితే అనారోగ్యానికి గురవుతారు. ఆ ఎఫెక్ట్‌ చివరికి బోన్స్‌పై పడుతుంది. అందుకే ప్రతి ఒక్కరు ఉదయాన్నే నిద్రలేచి కచ్చితంగా వ్యాయామం చేయాలి.

2. విటమిన్ డి లోపం

కొంతమంది సూర్యరశ్మి సరిగ్గా అందని నగరాల్లో ఇళ్లు కట్టుకుంటారు. దీనివల్ల విటమిన్ డి మీ శరీరానికి అందదు. ఎముకలు బలహీనమవుతాయి. పిల్లలకు సరైన సూర్యరశ్మి అందకపోతే రికెట్స్ వ్యాధి సంభవిస్తుంది. అందుకే ఉదయం కొద్దిసేపు ఎండ పడేవిధంగా నడవడం మంచిది.

3. తగినంత నిద్ర లేకపోవడం

మీకు తగినంత నిద్ర లేకపోతే ఎముకలు బలహీనంగా మారుతాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీరు 7 నుంచి 8 గంటలు నిద్రించాలి. బలహీనమైన ఎముకలతో అనేక సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి.

4. ఉప్పు అధికంగా వాడటం

మీరు ఉప్పుడు అతిగా తినడానికి ఇష్టపడితే వెంటనే ఈ అలవాటు మానుకోండి. లేదంటే ఇది ఎముకలను బలహీనపరుస్తుంది. ఉప్పులో సోడియం పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా కాల్షియం శరీరం నుంచి తగ్గడం ప్రారంభమవుతుంది.

5. ధూమపానం మానేయండి

ధూమపానం ఊపిరితిత్తులపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. కానీ ఇది ఎముకలను కూడా బలహీనపరుస్తుంది అనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు. అందుకే ఈ అలవాటుని వెంటనే విస్మరించండి. లేదంటే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories