Food In Plastic: ప్లాస్టిక్ కంటైనర్లలో ఆహారం తింటున్నారా.. అయితే మీకు అది వచ్చే ఉంటుంది ?

Health Risks of Eating From Plastic Containers and Ways to Avoid Them
x

Food In Plastic: ప్లాస్టిక్ కంటైనర్లలో ఆహారం తింటున్నారా.. అయితే మీకు అది వచ్చే ఉంటుంది ?

Highlights

Food In Plastic: ప్రస్తుతం ప్రతి ఇంట్లో ప్లాస్టిక్ పాత్రలు వాడుతున్నారు. టీ తాగడం దగ్గర నుంచి తినడం వరకు ప్రతిదానికీ ప్లాస్టిక్ పాత్రలను ఉపయోగిస్తున్నారు.

Food In Plastic: ప్రస్తుతం ప్రతి ఇంట్లో ప్లాస్టిక్ పాత్రలు వాడుతున్నారు. టీ తాగడం దగ్గర నుంచి తినడం వరకు ప్రతిదానికీ ప్లాస్టిక్ పాత్రలను ఉపయోగిస్తున్నారు. మార్కెట్లో లభించే అనేక ఆహార పదార్థాలు కూడా ప్లాస్టిక్‌లో ప్యాక్ చేసి వస్తున్నాయి. ప్రజలు ప్లాస్టిక్ విరివిగా ఉపయోగిస్తున్నారు. ప్లాస్టిక్ మన జీవితంలో భాగంగా మారిపోయింది. మార్కెట్ నుండి ప్లాస్టిక్ కంటైనర్లలో ఆహారాన్ని కొంటున్నారు. దీన్ని చాలా మంది లైట్ గా తీసుకుంటారు. కానీ ప్లాస్టిక్‌లో ఆహారం తినడం వల్ల ఆరోగ్యానికి చాలా హాని కలుగుతుంది. ప్లాస్టిక్ నెమ్మదిగా శరీరాన్ని విషపూరితం చేస్తోంది. ప్లాస్టిక్ పాత్రలలో తినడం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో, వాటిని నివారించడానికి మార్గాలు ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.

ప్లాస్టిక్‌లో బిస్ఫినాల్ ఎ, థాలేట్స్ వంటి అనేక హానికరమైన రసాయనాలు ఉంటాయి. వేడి ఆహారాన్ని ప్లాస్టిక్ కంటైనర్లలో నిల్వ చేసినప్పుడు ఈ రసాయనాలు ఆహారంలో కలిసిపోతాయి. ఇవి శరీరంలో హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతాయి. గుండె జబ్బులు, క్యాన్సర్, ఊబకాయం, మధుమేహం వంటి అనేక వ్యాధులను ఆహ్వానిస్తాయి.

ప్లాస్టిక్ కంటైనర్లలో ప్యాక్ చేసిన ఆహారాన్ని తినడం వల్ల కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ ప్రమాదం పెరుగుతుంది. శరీర అవసరాలకు అనుగుణంగా గుండె తగినంత రక్తాన్ని పంప్ చేయలేనప్పుడు ఈ పరిస్థితి తలెత్తుతుంది. ఇది కాలక్రమేణా శరీరంలోని ఇతర భాగాలలో రక్తం పేరుకుపోవడానికి కారణమవుతుంది. రక్తంలో ఎక్కువ భాగం ఊపిరితిత్తులు, కాళ్ళు , కాలి వేళ్ళలో పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ఇది తరువాత గుండె ఆగిపోయే ప్రమాదానికి దారితీస్తుంది.

దీనితో పాటు ప్యాక్ చేసిన ఆహారం క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు కూడా కారణం అవుతుంది. ప్లాస్టిక్‌లో ఉండే కొన్ని రసాయనాలు శరీరంలో ఎక్కువ కాలం పేరుకుపోతాయి. క్రమంగా క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులకు కారణమవుతాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా వేడి ఆహారాన్ని ప్లాస్టిక్ ప్యాకెట్లలో తీసుకువచ్చినప్పుడు ఈ ప్రమాదం మరింత పెరుగుతుంది.

ప్లాస్టిక్‌లోని విషపూరిత అంశాలు శరీర హార్మోన్లను పాడు చేస్తాయి. ఇది పురుషులు, మహిళలు ఇద్దరినీ ప్రభావితం చేస్తుంది. పురుషులలో స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. ఇది భవిష్యత్తులో బిడ్డను కనడంలో సమస్యలను కలిగిస్తుంది. స్త్రీలకు పీరియడ్స్ కు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు. ప్రతిరోజూ ప్లాస్టిక్ పాత్రలలో ఆహారం తింటే, క్రమంగా దాని చిన్న కణాలు శరీరంలో పేరుకుపోవడం ప్రారంభిస్తాయి. దీనివల్ల గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories