సీతాఫలం తినడం ఆరోగ్యానికి హానికరం కూడా..! ఎలాగో తెలుసా..?

Health News Eating Fruit Sugar Apple is Bad For Your Health | Healthy Food Habits
x

సీతాఫలం తినడం ఆరోగ్యానికి హానికరం కూడా..! ఎలాగో తెలుసా..?

Highlights

Fruit Sugar Apple: సీతాఫలం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో పోషకాలు అధికంగా ఉంటాయి...

Fruit Sugar Apple: సీతాఫలం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో పోషకాలు అధికంగా ఉంటాయి. అయితే ఏదైనా కానీ అతిగా తింటే విషమవుతుంది. సీతాఫలానికి కూడా ఇదే గుణం ఉంది. ఎక్కువగా తింటే శరీరానికి హాని చేస్తుంది. రోజుకు ఒక సీతాఫలం తింటే పర్వాలేదు. అంతకంటే ఎక్కువ తింటే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. సీతాఫలంలో కాపర్, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, విటమిన్ ఎ వంటి ముఖ్యమైన పోషకాలు అధికంగా ఉంటాయి.

సీతాఫలం ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు అందువల్ల దీనిని తినమని సలహా ఇస్తారు కానీ చాలా మందిలో అలర్జీకి కారణమవుతుంది. మీరు సీతాఫలాన్ని తిన్న తర్వాత దురద వంటి సమస్యలు ఏర్పడితే వెంటనే దీనిని తినడం మానుకోండి. ఇది మాత్రమే కాదు ఇప్పటికే అలెర్జీ సమస్యలు ఉన్నవారు సీతాఫలానికి దూరంగా ఉండటం మంచిది. అలర్జీ ఒక్కటే కాదు దీనివల్ల ఉదర సమస్యలు కూడా ఏర్పడుతాయి.

జీర్ణ సమస్యలు ఉన్నవారు సీతాఫలాన్ని అస్సలు తినకూడదు. ఎందుకంటే ఇందులో అధిక మొత్తం ఫైబర్ ఉంటుంది. సీతాఫలాన్ని అధికంగా తింటే మీరు కడుపు నొప్పి, ఫైబర్ కారణంగా పేగు బిగుతును ఎదుర్కోవలసి ఉంటుంది. సీతాఫలంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది మీరు సీతాఫలాన్ని ఎక్కువగా తీసుకుంటే దీని కారణంగా వాంతులు చేసుకోవచ్చు.

అంతేకాదు దీనివల్ల వికారం సమస్యను కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. సీతాఫలం రోజుకు ఒకసారి మాత్రమే తినాలి అది కూడా ఒక్కటి మాత్రమే. ఎందుకంటే ఇందులో కేలరీలు కూడా పుష్కలంగా ఉంటాయి. సహజంగానే బరువు పెరగడంలో కేలరీలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. సీతాఫలాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో క్యాలరీల పరిమాణం పెరుగుతుంది దీని కారణంగా బరువు పెరిగే సమస్య మొదలవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories