Diabetics: షుగర్ పేషెంట్లకు గమనిక.. ఇంటి నుంచే షుగర్‌ టెస్ట్‌ చేసుకోండి..!

Health News Blood Sugar Check at Home by Diabetics
x

Diabetics: షుగర్ పేషెంట్లకు గమనిక.. ఇంటి నుంచే షుగర్‌ టెస్ట్‌ చేసుకోండి..!

Highlights

Diabetics: షుగర్ పేషెంట్లకు గమనిక.. ఇంటి నుంచే షుగర్‌ టెస్ట్‌ చేసుకోండి..!

Diabetics: షుగర్‌ పేషెంట్లకి ఇది శుభవార్తే అని చెప్పవచ్చు. ఎందుకంటే బ్లడ్‌లో షుగర్‌ టెస్ట్ చేసుకునేందుకు ల్యాబ్‌కి వెళ్లి డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంట్లో కూర్చొని మీ బ్లడ్ షుగర్ లెవల్స్‌ని సులభంగా చెక్ చేసుకోవచ్చు. ప్రతి రోజు షుగర్ లెవల్స్‌ తెలుసుకోవాల్సిన రోగులు ఇండియాలో చాలామంది ఉన్నారు. దీనివల్ల వారి డబ్బు, సమయం రెండూ ఆదావుతాయి. కొన్ని చర్యల ద్వారా ఇంట్లోనే రక్తంలో చక్కెరను తనిఖీ చేయవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.

మధుమేహం ఒక తీవ్రమైన వ్యాధి అని అందరికీ తెలుసు. దీనికి శాశ్వత నివారణ లేదు. ఈ పరిస్థితిలో దీనిని కంట్రోల్‌ చేయడమే పరిష్కారం. ఈ వ్యాధిలో బాధితుడి రక్తంలో చక్కెర ఎప్పుడైనా పెరుగుతుంది. ఈ పరిస్థితిలో అనేక తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. డయాబెటిక్ రోగులందరూ రక్తంలో చక్కెర స్థాయిని ఎల్లప్పుడూ సమతుల్యంగా ఉంచుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. తద్వారా రాబోయే పెద్ద సమస్యలను సులభంగా నివారించవచ్చు.

అందువల్ల రోగులు ఎప్పటికప్పుడు రక్తంలో చక్కెరను తనిఖీ చేయాలని సూచించారు. ఇంత వేగవంతమైన జీవితంలో రక్తంలో చక్కెరను తనిఖీ చేయడానికి పదేపదే ల్యాబ్‌కు వెళ్లడం అందరికీ కుదరకపోవచ్చు. ఈ పరిస్థితిలో పెరుగుతున్న సాంకేతికత అభివృద్ధి కారణంగా మనం ఇంట్లో కూర్చొని షుగర్‌ లెవల్స్‌ చెక్‌ చేసుకోవచ్చు. ఇది మన సమయాన్ని డబ్బును ఆదా చేస్తుంది. మళ్లీ మళ్లీ డాక్టర్ దగ్గరకు వెళ్లడం కంటే బ్లడ్ షుగర్ చెక్ చేసుకునేందుకు బ్రాండెడ్ డివైజ్ కొనుక్కోవడం మేలు. కొనుగోలు చేసే ముందు దాని సాంకేతిక అంశాలను అర్థం చేసుకోవాలి. టెస్టింగ్ కిట్ ఎల్లప్పుడూ మీతో ఉండేలా చూసుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories