బట్టతలతో బాధపడుతున్నవారికి గుడ్ న్యూస్..

బట్టతలతో బాధపడుతున్నవారికి గుడ్ న్యూస్..
x
Highlights

ఇప్పుడు చాలా మందిని వేధిస్తున్న సమస్య బట్టతల. పాతికేళ్ళకే జుట్టు రాలిపోయి బాల్ హెడ్ వచ్చేస్తుంది. ఈ సమస్యతో చాలా మంది యువత కుంగిపోతోన్నారు. అయితే...

ఇప్పుడు చాలా మందిని వేధిస్తున్న సమస్య బట్టతల. పాతికేళ్ళకే జుట్టు రాలిపోయి బాల్ హెడ్ వచ్చేస్తుంది. ఈ సమస్యతో చాలా మంది యువత కుంగిపోతోన్నారు. అయితే సమస్యను అరికట్టడానికి అనేక పరిశోధనలు జరుగుతునే ఉన్నాయి. తాజాగా దేబబ్రత ఆరో ఫౌండేషన్‌ పరిశోధకులు రాలిపోయిన జుట్టును మళ్లీ మొలిపించే సరికొత్త ఇంజక్షన్‌ను తయారు చేశారు. ఈ ఇంజక్షన్‌ వల్ల జుట్టు తిరిగి పెరగడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది.

ఊడిపోయిన జుట్టును తిరిగి పొందేలా సరికొత్త ఇంజక్షన్‌ను అభివృద్ధి చేశామని సంస్థ సహ వ్యవస్థాపకులు కాస్మెటిక్‌ సర్జన్‌ డేబ్‌రాజ్‌ షోమ్‌ తెలిపారు. క్యూఆర్‌ 678' పేరుతో తయారు చేసిన ఈ ఇంజక్షన్ అన్నీ పరీక్షలను పూర్తి చేసుకుని తర్వాలో మార్కెట్‌లోకి విడదల చేయాలని సంస్ధ ప్రయత్నిస్తుంది. ఇప్పటికే వెయ్యి మందిపై ఈ ఇంజక్షన్‌ను పరీక్షించి విజయం సాధించామన్నారు. దీనిలో సహజసిద్దమైన ఉత్పెరకాలే ఉన్నట్లుగా సంస్ధ నిర్వాహుకులు వెల్లడించారు. తిరిగి జుట్టును పోందడానికి ఇంజక్షన్‌ను మూడు వారాలకొకసారి చొప్పున మొత్తం ఎనిమిదిసార్లు చేయించుకోవాలని చెప్పారు. . ఒక్కో ఇంజక్షన్‌ ధర రూ. 6 వేలని.. ఎనిమిది ఇంజక్షన్స్ కు రూ. 48 వేలు ఖర్చవుతుందని తెలిపారు.

వాటితో పాటు కొన్ని సహజ సిద్దమైన పద్దతులను పాటించడం ద్వారా తిరిగి పోందిన జుట్టును కాపాడుకోవచ్చట. వారానికి క‌నీసం రెండు సార్ల‌యినా క‌ల‌బంద గుజ్జును తలకు పట్టిస్తుండాలి. అలాగే త‌ల‌స్నా‌నం చేసే ముందు వేడి కొబ్బ‌రినూనెను మాడుపై మ‌ర్ద‌నా చేయాలి. రోజూ తినే ఆహారంలో గుడ్డు‌, పాలు, ఆకుకూర‌లు ఉండే విధంగా చూసుకోవాలి. ఒత్తి‌డిని నుంచి ఉపశమనం పోందేందకు వ్యా‌య‌మం చేస్తూ‌, మంచి సంగీతం వింటూ ఉంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories