Diabetics: మధుమేహ వ్యాధిగ్రస్తులు నిమ్మకాయ వాడొచ్చా.. !

Health Care Tips Lemon Benefits for Diabetics
x

Diabetics: మధుమేహ వ్యాధిగ్రస్తులు నిమ్మకాయ వాడొచ్చా.. !

Highlights

Diabetics: మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

Diabetics: మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. వారు ఏదైనా తినడానికి, తాగడానికి ముందు కొంచెం ఆలోచించాలి. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు నిమ్మకాయ వాడొచ్చా అనే అనుమానం చాలాకాలంగా ఉంది. నిజానికి నిమ్మకాయలో విటమిన్ సి, ఫైబర్, పొటాషియం, అనేక పోషకాలు ఉంటాయి. ఇవన్నీ డయాబెటిక్ రోగులకు వివిధ మార్గాల్లో పనిచేస్తాయి. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

నిమ్మకాయలో ఫైబర్ పుష్కలం

నిమ్మకాయలో 2.4 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇది డయాబెటిక్ రోగులకు గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారించడంలో సహాయపడుతుంది. నిమ్మలోని ఉండే అధిక ఫైబర్ గ్లైసెమిక్‌ని నియంత్రించి ఇన్సులిన్‌ను మెరుగుపరుస్తుంది. అలాగే ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించి బరువును తగ్గించడంలో దోహదం చేస్తుంది.

నిమ్మరసం రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది

నిమ్మకాయ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారం. వాస్తవానికి విటమిన్ సి చక్కెరను గ్రహించడంలో సహాయపడుతుంది. ఇందులోని కొన్ని సిట్రస్ ఫ్లేవనాయిడ్లు స్టార్చ్ జీర్ణక్రియలో సహాయపడతాయి. ఇది పేగులలో చక్కెర శోషణను తగ్గిస్తుంది. దీని కారణంగా చక్కెర మీ రక్తంలో నేరుగా కలిసిపోదు. ఇది షుగర్ స్పైక్‌ను నివారిస్తుంది. అందువల్ల షుగర్ పేషంట్స్ హాయిగా తినవచ్చు.

నిమ్మకాయలలో పెద్ద మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి అవసరం. పొటాషియం మీ రక్తపోటును తగ్గిస్తుంది. స్ట్రోక్, గుండెపోటు ప్రమాదం నుంచి కాపాడుతుంది. నిమ్మ హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది కాల్షియం పెరగడం వల్ల ధమనుల అడ్డంకిని తగ్గిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories