Health care: ఉదయాన్నే ఈ నాలుగు పనులు చేస్తున్నారా? అయితే మీ కాలేయం ప్రమాదంలో పడ్డట్లే..


Health care: ఉదయాన్నే ఈ నాలుగు పనులు చేస్తున్నారా? అయితే మీ కాలేయం ప్రమాదంలో పడ్డట్లే..
Health care: కాలేయం శరీరంలోని అతి ముఖ్యమైన అవయవం. శరీరంలో ఇది చేసే పని ఏంటంటే.. శరీరంలో పేరుకుపోయిన చెత్తను తొలగిస్తుంది.
Health care: కాలేయం శరీరంలోని అతి ముఖ్యమైన అవయవం. శరీరంలో ఇది చేసే పని ఏంటంటే.. శరీరంలో పేరుకుపోయిన చెత్తను తొలగిస్తుంది. కొవ్వును కరిగిస్తుంది. కాలేయం ఆరోగ్యంగా ఉంటేనే శరీరమంతా ఆరోగ్యంగా ఉంటుంది. అయితే ఉదయం లేచిన తర్వాత మీరు ఈ నాలుగు పనులు చేస్తున్నారంటే.. మీ కాలేయాన్ని మీరే చేతులారా పాడు చేసుకుంటున్నారు. మరి ఆ నాలుగు పనులేంటో ఇప్పుడు చూద్దామా..
లైఫ్ స్టైల్ మారిపోయింది. లేట్‌గా తినడం లేట్‌గా పడుకోవడం లేట్‌గా లేవడం. లేట్ అన్నది కామన్ అయిపోయింది. ఇది శరీరంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఎందుకంటే అన్ని ఆలస్యంగా శరీరానికి అందుతాయి. దీనివల్ల ఆరోగ్యంలో మార్పులు వస్తాయి. ముఖ్యంగా లైఫ్ స్టైల్ సరిగా లేకపోతే కాలేయం చెడుపోయే ప్రమాదం ఉంది. అందుకే ఉదయం లేవగానే ఈ నాలుగు పనులు అసలు చేయకూడదు.
అల్పాహారం
ఉదయం లేవగానే తొందరగా 9 గంటల లోపులో మీరు అల్పాహారం తీసుకుంటున్నారా? తీసుకోకపోతే మీరు మీ కాలేయాన్ని పాడుచేసుకుంటున్నారని అర్ధం. చాలామంది పనులు వల్లనో లేక తొందరగా లేవకపోవడం వల్లనో టిఫిన్ స్కిప్ చేస్తూ ఉంటారు. ఇలా మీరు అల్పాహారాన్ని స్కిప్ చేస్తే.. మీ కాలేయం మీ ఆరోగ్యాన్ని స్కిప్ చేస్తుంది. అది కూడా తక్కువ చక్కెర, ఎక్కువ ప్రోటీన్, ఫైబర్ ఉన్న ఆహారమైతే మీ దినచర్య అంతా హెల్దీగా ఉంటుంది.
మంచి నీళ్లు
ఉదయం లేవగానే నీళ్లు తాగడం లేదా? అయితే మీ కాలేయం ప్రమాదంలో పడుతుంది. ఉదయం లేచిన తర్వాత 9 గంటలలోపు ఒక లీటరు నీళ్లు వరకు తాగాలి. లేకపోతే కాలేయం సరిగా పనిచేయదు.
ఖాళీ కడుపుతో మెడిసిన్
డాక్టర్ చెప్పిన మెడిసిన్ తప్ప అల్పాహారం తీసుకోకుండా ఏ మందులూ మింగకూడదు. ఇలా చేస్తే అది కాలేయంపైనే తీవ్ర ప్రభావం పడుతుంది. కాలేయం సరిగా డీటాక్స్ చేయలేకపోతాది. కాబట్టి, అల్పాహారం తీసుకున్న తర్వాత ఎటువంటి మందులైనా వేసుకోవాలి.
డీటాక్స్ పానీయాలు
కొంతమంది శరీరాన్ని డీటాక్స్ చేయాలని అటువంటి డ్రింక్‌లు తెగ తాగేస్తూ ఉంటారు. కానీ ఇవి కాలేయానికి అసలు మంచివి కాదు. వీటికంటే నిమ్మకాయం, నీళ్లు తాగినా, నిమ్మకాయ, తేనె నీళ్లు తాగినా ఆరోగ్యానికి మంచిది.
వ్యాయామం
చాలామంది వ్యాయామం చేయడానికి టైం లేదని చెబుతుంటారు. ఉదయం అంటేనే పనులు ఉంటాయని అంటుంటారు. కానీ ఎన్ని పనులు ఉన్నా.. ఎంత బిజీగా ఉన్నా ఉదయాన్నే అరగంట పాటు వ్యాయామం చేయాలి. లేదంటే అరగంట పాటు వాకింగ్ చేయాలి. ఇది మీ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



