Health Care: కూరగాయలు చాలా ఫ్రెష్‌గా ఉన్నాయని కొనేస్తున్నారా? అయితే జర జాగ్రత్త


Health Care: కూరగాయలు చాలా ఫ్రెష్‌గా ఉన్నాయని కొనేస్తున్నారా? అయితే జర జాగ్రత్త
Health Care: ప్రస్తుతం ఏది తిన్నాలన్నా భయపడే పరిస్థితులు ఉన్నాయి. అందుకు కారణం పండ్లు, కూరగాయలు చాలా ఫ్రెష్‌గా కనిపించేందుకు వాటిపైన రకరకాల రసాయనాలు వాడటమే.
Health Care: ప్రస్తుతం ఏది తిన్నాలన్నా భయపడే పరిస్థితులు ఉన్నాయి. అందుకు కారణం పండ్లు, కూరగాయలు చాలా ఫ్రెష్‌గా కనిపించేందుకు వాటిపైన రకరకాల రసాయనాలు వాడటమే. అయితే వీటిని ఇలానే తినేసినా.. సరిగా శుభ్రం చేయకుండా తిన్నా పలు రకాల క్యాన్సర్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ఫుడ్ స్టేఫ్టీ అధికారులు చెబుతున్నారు.
సాధారణంగా కూరగాయలు, పండ్లపై పురుగులు మందులు కొడుతుంటాయి. ఇవే పెద్ద ప్రమాదం అయితే.. ఇప్పుడు కొత్తగా తాజాగా కనిపించేందుకు పలు రకాల కెమికల్స్ వాడుతున్నారు. ఇవి ఏకంగా క్యాన్సర్ కారకాలని డాక్టర్లు అంటున్నారు. ఎట్టిపరిస్థితుల్లో ఎక్కువ పచ్చగా ఉన్న కూరగాయలు మీకు మార్కెట్లో కనిపిస్తే కాస్త ఆలోచించి తీసుకోండి అని అంటున్నారు.
బెండకాయ, దొండకాయ, బఠాణీ, చిక్కుడుకాయ.. ఇలాంటి పచ్చని రంగులో ఉండే కూరగాయలు తాజాగా కనిపించేందుకు మలాకైట్ అనే రసాయనాన్ని వాడుతున్నారని ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారుల సర్వేలో తేలింది. ఈ రసాయనంలో ఈ కూరగాయలను వేసి కలపడం వల్ల అవి చాలా ఫ్రెష్‌గా అదేవిధంగా మంచి పచ్చని రంగులో కూరగాయలు కనిపిస్తాయి. ఇలా ఫ్రెష్‌గా, పచ్చని రంగులో కనిపించే కూరగాయలకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువ. కానీ ఇలాంటి రసాయనాలు కలిపిన ఆహారాన్ని తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఇటీవల సర్వే జరిపిన ఫుడ్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు.
మలాకైట్ అంటే ఏంటి?
మలాకైట్ రసాయనం చేపలకు యాంటీ ప్రోటో జోవన్, యాంటీ ఫంగల్ మెడిసిన్‌గా ఉపయోగిస్తారు. ఈ రసాయనాన్ని ఆక్వాకల్చర్, ఫుడ్, హెల్త్, టెక్ట్స్ టైల్స్.. వంటి కొన్ని రకాల పరిశ్రమలో విరివిగా ఉపయోగిస్తారు. ఇది చేపల్లో వచ్చే ఫంగస్, బ్యాక్టీరియాను చంపే రసాయనం. అయితే ఇటీవల కాలంలో ఈ రంగును పచ్చిమిర్చి, దొండకాయ, బెండకాయ, పాలకూర, బఠానీలు పచ్చగా కనిపించేందుకు ఉపయోగిస్తున్నారు.
ఎలా తినాలి?
మార్కెట్ నుంచి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ప్రతి కూరగాయలను మంచినీటితో శుభ్రం చేసి పెట్టాలి. లేదంటే ఉప్పు. నిమ్మరసం కలిపిన నీళ్లలో అయినా వీటిని అరగంట పాటు నానబెడితే రంగు మొత్తం కూరగాయల నుంచి విడిపోతుంది. లేదంటే వెనిగర్ వేసిన నీళ్లలో నానబెట్టినా కూడా రంగు వదిలిపోతుంది. ఆ తర్వాత వీటిని మంచినీళ్లలో కడగాలి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



