గోరింటాకుతో రోగ నిరోధక శక్తి పెంపు..

గోరింటాకుతో రోగ నిరోధక శక్తి పెంపు..
x
Highlights

ఆషాడమాసం రాగానే చాలమంది ఆడపిల్లలు.. తమ చేతులకు గోరింటాకు పెట్టుకుంటారు.

ఆషాడమాసం రాగానే చాలమంది ఆడపిల్లలు.. తమ చేతులకు గోరింటాకు పెట్టుకుంటారు. అయితే చాలమంది అందంగా కనిపించటం కోసం అలా గోరింటాకు పెట్టుకంటారని అనుకుంటారు. కానీ ఇలా గోరింటాకు పెట్టుకోవటం వెనుక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగున్నాయన్న సంగతి చాల కొద్ది మందికే తెలుసు.

అవును.. భార‌తీయులు పాటించే ప్ర‌తి ఆచారం వెనుక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగుంటాయి. సాధరణంగా ఆషాడంలో వర్షాలు పడుతుంటాయి. దీంతో వతావరణం అంతా చల్లగా మారుతుంది. ఇక ఈ కాలంలో సూక్ష్మక్రిములు పెరిగి అంటురోగాలు వ్యాపించే అవకాశం ఉంది. అయితే, వర్షాలు ఎక్కువగా పడడం వల్ల వాతావరణం చల్లబడుతుంది కానీ, ఒంట్లో వేడి అలానే ఉంటుంది. బయట వాతావరణానికి సమానంగా మన శరీరం మారదు. దీంతో సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అయితే గోరింటాకులో వేడిని తగ్గించే గుణం ఉంటుంది. అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని పెంచి రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. అందుకే ఈ సమయంలో గోరింటాకు పెట్టుకోవాలని చెబుతారు.

ఇక గోరింటాకు ఎర్ర‌గా పండితే మంచి మొగుడు వ‌స్తార‌ని ఆడపిల్లలకు చెబుతుంటారు. దీంతో గోరింటాకు ఎర్రగా పండాలని ఆడపిల్లలు కోరుకుంటుంటారు. అయితే కొన్ని టిప్స్ పాటిస్తే గోరింటాకు ఎర్రగా పడుతుంది. గోరింటాకు రుబ్బేట‌ప్పుడు కొంచెం మజ్జిగ‌, వ‌క్క‌, నిమ్మ‌ర‌సం వంటి ప‌దార్థాలు వేస్తే గోరింటాకు ఎర్ర‌గా పండుతుంది. ఇంకో విష‌యం గోరింటాకు పెట్టుకున్న త‌ర్వాత పూర్తిగా ఆరిపోయి రాలిపోయేంత వ‌ర‌కు చేయి క‌డుగ‌కూడ‌దు. అంత‌సేపు ఉండాలంటే క‌ష్టం అని చాలామంది రాత్రులు పెట్టుకొని ప‌డుకుంటారు. గోరింటాకు శుభ్రం చేసుకున్న త‌ర్వాత చేతుల‌కు కొబ్బ‌రి నూనె రాసుకోవాలి. అప్పుడే గోరింటాకు మంచి క‌ల‌ర్‌లోకి వ‌స్తుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories