logo
లైఫ్ స్టైల్

Health Benefits with Ginger: అల్లంతో ఆరోగ్య ప్రయోజనాలు...

Health Benefits with Ginger: అల్లంతో ఆరోగ్య ప్రయోజనాలు...
X
Highlights

Health Benefits with Ginger | అల్లం ఒక చిన్న మొక్క వేరునుండి తయారవుతుంది.

Health Benefits with Ginger | అల్లం ఒక చిన్న మొక్క వేరునుండి తయారవుతుంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. ఇది భారతదేశం, చైనా దేశాలలో చాలా ప్రాముఖ్యమైనది. కొన్ని శతాబ్దాల నుంచీ చైనీయుల వైద్యంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తూ వస్తోంది. కన్ఫ్యూషియస్ తన రచనల్లో దీనిగురించి ప్రస్తావించాడు. ఆసియా దేశాల్లో చేసే చాలా వంటకాల్లో ఇది విడదీయలేని భాగం. పచ్చళ్ళలోనూ, కూరల్లో వేసే మసాలా లోనూ దీన్ని విస్తృతంగా వాడుతారు. ఎండాకాలంలో వడకొట్టకుండా, అల్లాన్ని కరివేపాకు, మజ్జిగలతో కలిపి తీసుకుంటారు. చాలామందికి ప్రయాణాల్లో వాంతులు మహా ఇబ్బంది పెడుతుంటాయి. వీటిని అల్లంతో అరికట్టవచ్చంటున్నారు ఆయుర్వేద వైద్యులు. అల్లం నోటి దుర్వాసనను పోగోడుతుంది. అల్లం నోటిలో చేరిన ప్రమాదకర బ్యాక్టీరియాలను సంహరించి, దంతాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణం అల్లానికి ఉంది. అల్లం ప్రభావం కాలేయం మీద ఉంటుంది. కొలెస్టరాల్ నియంత్రణలో మెరుగైన పాత్ర వహించేలా కాలేయాన్ని తయారు చేయడమే అల్లం నిర్వహించే పాత్ర. రక్త నాళాల్లో రక్తప్రవాహం మెరుగుపరుస్తుంది. నాళాలు మూసుకు పోవడం జరుగదు. కీళ్లవారు, ఆస్త్మాల నుండి ఉపశమనం అందిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అల్లం, చిటికెడు ఉప్పును భోజనానికి ముందుగానీ, తర్వాతగానీ తీసుకుంటే జీర్ణక్రియ బాగా జరుగుతుంది. అల్లం మలబద్ధకాన్ని పోగొడుతుంది. సులభ విరోచనకారి కూడా. కడుపు ఉబ్బరం తగ్గిస్తుంది.

అల్లంతో ఉపయోగాలు...

♦ మొదటి ముద్దగా అన్నంలో శొంఠిని పలుచగా కలిపి నేతితో తింటే, అజీర్తి పోతుందని నమ్మకం.

♦ బాలింతరాలుకు శరీరము గట్టి పడేందుకు, వేడి కలిగేందుకు శొంఠిని విస్తృతంగా వాడుతారు.

♦ ఆయుర్వేద మందులలో ఇది ఎక్కువ కనిపిస్తుంది.

♦ అల్లం మంచి యాంటి ఆక్షిడెంట్ గా పనిచేస్తుంది.

♦ రక్త శుద్ధికి తోడ్పడుతుంది.

♦ రక్తం రక్త నాళాలలో గడ్డకట్టనీయకుండా సహాయపడుతుంది.

♦ అల్లం కొన్ని వారాలపాటు వాడితే .. కీళ్ళ నొప్పులు తగ్గుతాయి.

♦ అల్లం వల్ల కడుపులో పూత (అల్సరు) ఏర్పడదు.

♦ అల్లము నోటి దుర్వాసనను పోగొడుతుంది. నోటిలో చేరిన ప్రమాదక బ్యక్టీరియల్ను సంహరించి, దంటాలను ఆరోగ్యముగా ఉంచుతుంచి. అల్లం నుండిఅల్లం నూనెను తయారు చేస్తారు.

అల్లంలోని ఔషదగుణాలు...

ఇది ఆకలిని పెంచుతుంది.జీర్ణ రసాలు ఊరడాన్ని ప్రేరేపిస్తుంది.ఆకలి తక్కువగా ఉన్నవారు చిన్న అల్లం ముక్కకు ఉప్పు అద్ది దాన్ని నమిలితే ఆకలి పుట్టును.

అల్లం ప్రయాణంలో ఉన్నపుడు కలిగే వికారాన్ని తగ్గిస్తుంది.

♦ కొన్ని వేల సంవత్సరాలనుండి అల్లాన్ని జలుబు, ఫ్లూ చికిత్స కోసము వాడుతున్నారు.

♦ అల్లం టీ తగడము వలన అజీర్తి తగ్గుతుంది.

♦ అల్లం పొడి అండాశయ క్యాన్సర్ కణాల్లో కణ మరణాన్ని ప్రేరేపిస్తుంది.

♦ అల్లం తినడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

♦ మిన్నెసోటా విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రకారం అల్లం కొలరెక్టల్ క్యాన్సర్ కణాలు వృద్ధిని తగ్గిస్తుంది. అందువలన ఇది పెద్దప్రేగు క్యాన్సర్ నివారణలో సహాయపడుతుంది.

♦ గర్భిణీ స్త్రీలలో తలతిరుగడం, వికారము, వాంతులు ఎక్కువగా ఉంటాయి. అల్లం తినడము వలన బాగా ఉపశమనం కలుగుతుంది.

Web TitleHealth Benefits with Ginger in Daily Life
Next Story