Health Benefits with Fenugreek: మెంతులుతో ఆరోగ్య ప్రయోజనాలు..

Health Benefits with Fenugreek: మెంతులుతో ఆరోగ్య ప్రయోజనాలు..
x
Highlights

Health Benefits with Fenugreek: మనం ఆహారంలో ఉపయోగించే మసాలా దినుసులు. మెంతి ఆకులు ఆకుకూరగా ఉపయోగిస్తారు.

Health Benefits with Fenugreek: మనం ఆహారంలో ఉపయోగించే మసాలా దినుసులు. మెంతి ఆకులు ఆకుకూరగా ఉపయోగిస్తారు. ప్రతి ఇంట్లో పోపు సామాను పెట్టెలో తప్పక కనిపించేవి మెంతులు. ప్రతి రోజూ మన ఆహారంలో ఏదో ఒక రూపంలో మెంతులను వాడుతుంటాం. మెంతి పొడిని ఊరగాయల్లోనూ, మెంతి గింజలను చారు, పులుసు, పోపులోనూ వాడతాం. మెంతి ఆకులను పప్పుకూరగా, కూరల తయారీలోనూ వాడడం తెలిసిందే. మెంతులలో ఔషధగుణాలనున్నాయని చాలా మందికి తెలుసు.

అయితే, ఇటీవల జరిగిన పరిశోధనల్లో మధుమేహ వ్యాధి నియంత్రణకు మెంతులు ఉపయోగపడతాయని నిర్ధారణ అయ్యింది. మెంతులను ఆయుర్వేదంలో దీపనీ, మిత్రి అని అంటారు. హిందీలో మెథీ అని పిలుస్తారు. ముదురు పసుపు రంగులో ఉండి, గింజలలోని ఘాటైన సుగంధ తైలాలు, ఔషధ తత్వాన్ని కలిగి ఉంటాయి. గింజలలో కొన్ని రకాల రసాయనాలు ఉంటాయి. గింజల్లోని జిగురు, చేదు రుచి కూడా ఈ రసాయనాల వల్లనే. జీర్ణాశయం సంబంధ సమస్యలకు మెతులు మంచి ఔషధం. స్థూలకాయం, చెడు కొలెస్టరాల్‌, మధుమేహం అదుపునకు ఇవి దోహదపడతాయి.

మెంతి ఆకుల ఔషధ గుణాలు..

* ఆకులు గుండెకు, పేగులకు మంచి ఔషధం.

*‌ పైత్యం అధికంగా ఉన్నప్పుడు ఆకులను శుభ్రంగా కడిగి రసంగా చేసి, ఒక చెమ్చాడు తేనె కలిపి తీసుకుంటే త్వరగా తగ్గుతుంది.

*‌ కామెర్ల వచ్చిన వారికి, లివర్‌ సిర్రోసిస్‌ ( కాలేయ క్షయం)తో బాధపడుతున్న వారికి ఆకుల దంచి కాచిన రసం తేనె కలిపి తాగిస్తే ఆకలి పెరిగి త్వరగా కోలుకుంటారు. (అయితే డాక్టర్‌ సలహా మేరకు మందులు కూడా వాడాలి)

‌* ఆకులను రసంగా చేసి రాత్రి భోజనానికి ముందు తాగితే చక్కగా నిద్రపడుతుంది.

‌* ఆకుల రసాన్ని పిప్పితో సహా నిమ్మకాయ పిండి భోజనానికి ముందు తాగితే స్థూలకాయులు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు కొంత గుణం కనిపిస్తుంది.

*‌ ఆకును దంచి పేస్ట్‌గా చేసి తలకు రాస్తే చుండ్రు, వెండ్రుకలు రాలడం తగ్గుతాయి. వెండ్రుకలు నిగనిగలాడతాయి.

‌* ఆకులను దంచి పేస్ట్‌గా ముఖానికి రాస్తే ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. పొడి బారడడం తగ్గుతుంది.

కంటి నుండి అదే పనిగా నీరు కారతుంటే ఆకులను శుభ్రమైన వస్త్రంతో కట్టి రాత్రి పూట కంటికి కట్టాలి. వైట్‌హెడ్స్ నివారణలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ ఔషధం మెంతి ఆకుల మిశ్రమం.

100 గ్రాముల మెంతి గింజల్లో ఉండే పోషక విలువలు..

* పిండిపదార్థాలు 44.1 శాతం

* ప్రోటీన్లు 26.2 శాతం

* కొవ్వు పదార్థాలు 5.8 శాతం

* పీచు పదార్థం 7.2 శాతం

* తేమ 13.7 శాతం

కాల్షియం, పాస్పరస్‌, కెరోటిన్‌, థయమిన్‌, నియాసిన్‌ కూడా ఉంటాయి. అరగడానికి రెండు గంటలు పడుతుంది. 333 కిలో కేలరీల శక్తి విడుదలవుతుంది. మెంతి ఆకుల్లో ఏ విటమిన్‌ అధికంగా ఉంటుంది. మెంతుల నుండి మెంతుల ఆవశ్యక నూనెను ఆవిరి స్వేదన క్రియ ద్వారా సంగ్రహిస్తారు.

మెంతులు వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు...

* మహిళల గర్భాశయ ఆరోగ్యాన్ని పెంచుతుంది.

* శరీరంలోని చెడు కొలెస్టరాల్ ను తగ్గిస్తుంది.

* డయాబెటీస్ ను కంట్రోల్ లో ఉంచుతుంది.

* మలబద్దకం నుంచి ఉపసమనం కలిగిస్తుంది.

* జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

* అల్సర్లను నివారిస్తుంది.

* కాలేయాన్ని శక్తివంతం చేస్తుంది.

* ఆకలిని కంట్రోల్ చేసి.. బరువును తగ్గిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories