Health Benefits with Cardamom: యాలకులతో ఆరోగ్య ప్రయోజనాలు..

Health Benefits with Cardamom: యాలకులతో ఆరోగ్య ప్రయోజనాలు..
x
Highlights

Health Benefits with Cardamom: యాలకులు ఒక మంచి సుగంధ ద్రవ్యము. పచ్చయాలకుల శాస్త్రీయ నామం ఎలెట్టరీయా (Elettaria)

Health Benefits with Cardamom: యాలకులు ఒక మంచి సుగంధ ద్రవ్యము. పచ్చయాలకుల శాస్త్రీయ నామం ఎలెట్టరీయా (Elettaria), నల్ల యాలకులు శాస్త్రీయ నామం అమెమం (Amomum). యాలకులు పురాతన కాలం నుండి సుగంధ ద్రవ్యంగా వాడబడుతున్నవి. 2వ శతాబ్దంలో శుశ్రుతుడు రాసిన చరక సంహితం లోను, 4వ శతాబ్దంలో కౌటిల్యుడు రాసిన అర్ధశాస్త్రం లోను వీటి ప్రస్తావన ఉంది. వీటిని సుగంధద్రవ్యాల రాణిగా పేర్కొంటారు. కాని వీటిని పెద్ద ఎత్తున వ్యవసాయ పంటగా పండించినది బ్రిటిష్ వారు.

మన వంటిల్లే ఒక వైద్యశాల. అందులో మనం వాడే వస్తు వులు సమస్తం ఆరోగ్యహేతువులే. వాటిలో అత్యధికంగా వాడబడేది ఇలద్వయ. అంటే వాడుకలో దీనినే యాలకులు అని అంటాం. దీని శాస్త్రీయనామం ఇలటేరియా కార్డిమమ్‌. సుగంధ ద్రవ్యాల్లో అత్యంత సువాసన గల వస్తువుల్లో ఇదే ప్రథమ స్థానంలో ఉంటుంది. ఇది సిటామినేసి కుటుంబానికి చెందిన మొక్క. ఇది సాధారణ మొక్కలకి భిన్నంగా రసాయ నాలు, మనసుకి ఉల్లాసాన్ని కలిగించే తైలంతో చాలా విల క్షణంగా ఉండే ఔషధ మొక్క ఇలద్వయం. వీటిలో చిన్న యాలకులు, పెద్ద యాలకులు అని రెండు రకాలు ఉంటాయి. ఈ రెండూ ఒకే విధమైన ఔషధగుణాలు కలిగివుం టాయి.

ఔషధగుణాలు..

యాలకులు అనాదిగా ఆయుర్వేద శాస్త్రీయ వైద్యవిధానంలో వాడకంలో ఉన్నట్టు కరక సంహిత, సుశ్రుత సంహిత అనే గ్రంథాల ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా వీటినుండి తయారైన ఇలాదికర్న, ఇలాదివతి, ఇలాదిక్వత, ఇలాదిమొదక, ఇలాద్యారిష్ట, శీతోఫలాదికర్న, అరవిందసవ వంటి ఔషధాలు చాలా ప్రాచుర్యాన్ని పొందాయి. శరీరానికి చలువచేసే గుణాలు ఎక్కువగా ఇందులో ఉండటం మూలంగా వీటిని అనేక పానీయాల్లో, వంటకాల్లో వినియోగించడం అనవాయితీగా వస్తోంది.

ఉపయోగాలు..

* దీనితో తయారుచేయబడిన అంతవర్ధ ప్రసమన, ఉబ్బసం వ్యాధితో బాధపడేవారికి దివౌషధంగా పనిచేస్తుంది.

* ఒళ్ళు నొపðలకి, సిరోవిరికన అనే ఔషధం, నాసికా చికిత్సకి అనాదిగా వాడుతున్నట్టు వైద్య సంహితల్లో పేర్కొన్నారు. యాలకులు బాగా నూరి నుదురుకి లేపనం చేస్తే తల నొప్పి చిటి కెలో మటుమాయమవు తుంది.

* అలాగే యాలకుల కషా యం సేవిస్తే దగ్గు నుంచి మంచి ఉపశమనం ఉం టుంది.

* యాలకుల గింజలు నోటితో నములుతుండటం వల్ల క్రిములు నశించడమే కాకుండా నోటి దుర్వాసనను అరికడుతుంది. దంతాలను, చిగుళ్ళను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది.

* యాలకులు నూరి పేస్ట్‌గా చేసి గాయా లకి, పుండ్లకి పైలేపనంగా వాడితే వెంటనే మానిపో తాయి.

* వీటిని నములుతూ ఉండటం వల్ల ఉదర సంబంధ వ్యాధులు ఉపశమించడమే కాక కడుపులో ఏర్పడ్డ పుండ్లు (అల్సర్స్‌) కూడా తగ్గుముఖం పడ తాయి.

* చాలా రకాల రుగ్మత లకి ఇలద్వయ (ఇలాచీ-యాలకులు) ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది.

* యాలకుల తైలం పంటినొ ప్పిని నివారించి, క్రిముల్ని సమూలంగా నాశనం చేస్తుంది.

* దీని కషాయం సేవిస్తే వాంతులు అరికట్టి, జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది.

* యాలకుల పొడి, సొంటిపొడి 0.5గ్రా్ప్పచొపðన సమపాళ్ళలో తయారుచేసుకుని అందులో కొంచెం తేనె కలిపి తీసుకుంటే, కఫాన్ని నిర్మూలించి, దగ్గు నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

* ఆస్త్మా రోగులు యాలకులు, జాతిఫల, కుంకుమ పువ్వు, వంశలోకన, నాగకేసర, శంఖజీరక సమ పాళ్ళలో నూరి తేనెతో కలిపి సేవిస్తూవుంటే ఆ వ్యాధి నుంచి మంచి ఉపశమనం ఏర్పడుతుంది.

ఇలా అన్ని రుగ్మతలకీ ఉపయోగపడే ఈ ఇలద్వయ సంజీవని వంటిదని చెప్పడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. దీనిని ఇంటి ఆవరణలో కూడా పెంచుకుంటే అందమైన పుష్పాలతో, సంవత్సరం పొడవునా ఉండే పచ్చని ఆకులతో ఇంటికి శోభనివ్వడమేకాకుండా మంచి ఔషధం కూడా మన పెరటిలో ఉన్నట్టే.

Show Full Article
Print Article
Next Story
More Stories