పుచ్చకాయల్లోనే.. కాదు దాని గింజల్లోనూ ఎన్నో పోషకాలు

పుచ్చకాయల్లోనే.. కాదు దాని గింజల్లోనూ ఎన్నో పోషకాలు
x
Highlights

పుచ్చ కాయల్లో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.. అన్ని సీజన్‌లలో లభించే వీటికి వేసవి సీజన్‌లోనే మంచి డిమాండ్ ఉంటుంది.. ముఖ్యంగా ఎండ వేడిమి నుంచి ఉపశమనాన్ని పొందేందుకు పుచ్చకాయను తినేందుకు ఇష్టపడుతుంటారు ప్రజలు.

పుచ్చ కాయల్లో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.. అన్ని సీజన్‌లలో లభించే వీటికి వేసవి సీజన్‌లోనే మంచి డిమాండ్ ఉంటుంది.. ముఖ్యంగా ఎండ వేడిమి నుంచి ఉపశమనాన్ని పొందేందుకు పుచ్చకాయను తినేందుకు ఇష్టపడుతుంటారు ప్రజలు. పుచ్చకాయలో సమృద్ధిగా లభించే బి విటమిన్ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది... అందుకేనేమో జపాన్, చైనా దేశాల్లో ఇంటికి వచ్చే అతిధులకు పుచ్చకాయలను బహుమతిగా అందిస్తారట. పుచ్చలోనే.. కాదు దాని గింజల్లోనూ ఎన్నో పోషకాలు ఉన్నాయంటున్నారు నిపుణులు..

ముఖ్యంగా గుండె జబ్బుల ముప్పు నుంచి ఈ గింజలు బయటపడేస్తాయట. ఇంకా యూరిక్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడేవారు.. ఈ గింజలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కిడ్నీ సమస్యలతో బాధపడేవారు...ఈ గింజలను తీసుకోవడం వల్ల సమస్య నుంచి బయటపడవచ్చని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు..పుచ్చగించలను నీటిలో వేసి మరిగించి టీ లా తీసుకోవడం వల్ల చక్కటి ఫలితం లభిస్తుంది.

జ్ఞానపశక్తిని, ఏకాగ్రతను పెంచుకోవడానికి పుచ్చగింజలు సహాయపడతాయి. పుచ్చగింజల్లో ఉండే ఫోలిక్ యాసిడ్ మెదడు పనితీరుని చురుగ్గా చేస్తుంది. చర్మం మెరవాలన్నా... నున్నగా తయారవ్వాలన్న పుచ్చగింజలు బెస్ట్ మెడిసిన్ అంటున్నారు. పుచ్చ గింజల్లో ఐరన్ శాతం అధికంగా ఉంటుంది.. ఇవి శరీరంలో ఏర్పడిన క్యాలరీలను శక్తిగా మార్చటంలో సహాయపడుతుంది.శరీరంలో కొవ్వ ఏర్పడకుండా సహాయపడుతుంది. ఇక బిపితో బాధపడేవారు ఈ పుచ్చగింజలను తరుచుగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అంతే కాదు పురుషుల్లో వీర్య కణాల ఉత్పత్తిని పెంచడానికి ఇవి ఎంతగానో సహాయపడతాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories