నడకతో రోగాలు నయం

నడకతో రోగాలు నయం
x
Highlights

పచారీ కొట్టుకు వెళ్లాలన్నా..పక్క గల్లీలో ఉన్న స్నేహితుడిని కలవాలన్నా...కిలో మీటరు దూరంలో ఉన్న కాలేజీకి , స్కూల్‌కు వెళ్లాలన్నా... ఇప్పుడు కాళ్లతో పనిలేకుండా పోతోంది.

పచారీ కొట్టుకు వెళ్లాలన్నా..పక్క గల్లీలో ఉన్న స్నేహితుడిని కలవాలన్నా...కిలో మీటరు దూరంలో ఉన్న కాలేజీకి , స్కూల్‌కు వెళ్లాలన్నా... ఇప్పుడు కాళ్లతో పనిలేకుండా పోతోంది... ఎక్కడికి వెళ్లాలన్నా...వాహనాలనే ఆశ్రయిస్తున్నారు . చాలా మంది...నడకను పక్కన పెట్టు సోమరితనాన్ని అలవాటు చేసుకుంటున్నారు. ఒకప్పుడు మైళ్లకు మైళ్ల దూరాన్ని కాలి నడకతోనే చేసేవారు మన పెద్దవారు.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం గజిబిజి బిజీ బిజీ జీవితాన్ని గడుపుతున్న చాలా మంది నడక ద్వారా కలిగే ప్రయోజనాలను విస్మరిస్తున్నారు. మూడు కాళ్ల కుర్చీకి బంధీలవుతున్నారు.. కానీ ఇప్పుడున్న రోజుల్లో నడక ద్వారా మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు.

అందుకనే రోజూ నడవాల్సిందే... ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ ఎవ్వరూ ఆచరించరు.. అనుసరించరు..కాబట్టి నడక ద్వారా కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం... పదండి.. ప్రతీ రోజు కనీసం ఒక 30 నిమిషాల పాటు కాళ్లకి పనిచెబితే..శరీరాకి ఎంతో మేలు చేసిన వారము అవుతాము..ఇది డాక్టర్లు చెప్పిన విషయమే.. కాబట్టి ఎన్ని పనులున్నా...రోజులో కాస్త సమయాన్ని నడవడానికి కేటాయించండి. పనిలో చాలా టెన్షన్లు ఉన్నాయి వాటిని తగ్గించుకోవడం ఎలా? స్ట్రెస్ నుంచి రిలీఫ్ పొందటం ఎలా అని చాలా మంది మదనపడుతుంటారు..ఇలాంటి వారు పడుకోవడం, మ్యూజిక్ వినడం లేదా కాస్త టైం ఎంటర్‌టైన్‌మెంట్‌కి కేటాయిస్తుంటారు.. వీటితో పాటే రోజూ అరగంట నడిస్తే చాలు మీ స్ట్రెస్‌ మటుమాయం అవుతుందంటున్నారు నిపుణులు. నడక వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుందంట.

అధిక బరువుతో బాధ పడేవారు రోజూ వ్యాయామంతో పాటు నడక ప్రారంభిస్తే చక్కటి ఫలితాన్ని పొందవచ్చు. అంతే కాదు శరీర కండరాలు చురుగ్గా మారుతాయి. మరీ ముఖ్యంగా ఊపిరితిత్తుల వ్యాధులు, గుండె సంబంధిత వ్యాధులు దరిచేరనివ్వకుండా నడక మేలుచేస్తుందంటా. బీపీ కూడా అదుపులో ఉంటుంది. ఎక్కువ సమయం కూర్చోవడం... అదే పనిగా ఎక్సర్‌సైజ్‌లు చేయడం వల్ల నడుం నొప్పి వస్తుంటుంది. దీని నుంచి బయట పడాలంటే తప్పనిసరిగా నడక ప్రారంభించాల్సిందే. నడక వల్ల కంటి చూపు కూడా మెరుగవుతుందని అంటున్నారు వైద్యులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories