పొట్టుతీయని ధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మేలు..

పొట్టుతీయని ధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మేలు..
x
Highlights

చాలా వరకు ఫుల్ పాలిష్ ధన్యాలనే ఎక్కువగా ఆహారంగా తీసుకుంటుంటారు. కానీ పొట్టుతీయని ధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిని తినడం వల్ల కాలేయ...

చాలా వరకు ఫుల్ పాలిష్ ధన్యాలనే ఎక్కువగా ఆహారంగా తీసుకుంటుంటారు. కానీ పొట్టుతీయని ధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిని తినడం వల్ల కాలేయ క్యాన్సర్‌ నివారణకు తోడ్పడతుంది. అన్ పాలిష్ ధాన్యాలను తీసుకోవడం వల్ల కాలేయ సంబంధింత వ్యాధులు గణనీయంగా తగ్గుతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. దీనిపై పరిశోధన జరిపిన శాస్త్రవేత్తలు పలు విషయాలను వెల్లడించారు. రోజుకు 7 గ్రాములు, అంతకన్నా తక్కువగా పొట్టుతీయని ధాన్యాలు తీసుకునేవారితో పోలిస్తే.. రోజుకు 33 గ్రాములు లేదా రెండు సార్లు పొట్టుతీయని ధాన్యాలు తినేవారికి కాలేయ క్యాన్సర్‌ ముప్పు తగ్గుతున్నట్లు గుర్తించారు.

దాదాపు 24 సంవత్సరాల పాటు 1.25 లక్షల మందిని పరిశీలించిన తర్వాత పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. అదనంగా 12 గ్రాముల పొట్టుతీయని ధాన్యాలకు తీసుకుంటే కాలేయ క్యాన్సర్‌ ముప్పు 16% వరకు తగ్గుముఖం పడుతున్నట్లు వివరించారు. అన్ పాలిష్ ధాన్యాల్లోని పీచు ఇన్సులిన్‌ నివరించి రక్తంలోని ఇన్సులిన్‌ స్థాయులను తగ్గిస్తాయి. శరీరంలోని వాపు ప్రక్రియ తగ్గటానికి ఇవి తోడ్పడుతాయి. దీంతో కాలేయ క్యాన్సర్‌ ముప్పూ తగ్గుతుందని తెలిపారు. అలాగే ఊబకాయం, మధుమేహం, దీర్ఘకాల హెపటైటిస్‌ బి, హెపటైటిస్‌ సి, అతిగా మద్యం తాగటం, పొగ అలవాటు లాంటివి కాలేయ వ్యాధులకు దారితిస్తాయి. వీటి వల్ల కాలేయ క్యాన్సర్ వచ్చే అవకాశలు ఎక్కువ

శరీరంలో పీచు పదార్థం తగ్గటం వల్ల కాలేయ క్యాన్సర్‌ ముప్పును తెచ్చిపెట్టొచ్చని అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి. కావున దంపుడు బియ్యం, పొట్టుతీయని గోధుమలు, చిరుధాన్యాలు, ఓట్స్‌ వంటివి ఆహారంగా మంచిదని పరిశోధకులు వెల్లడించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories