Rose Apples: రోజ్ యాపిల్ వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు వదలరు!!

Rose Apples
x

Rose Apples: రోజ్ యాపిల్ వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు వదలరు!!

Highlights

Rose Apples: రోజ్ యాపిల్.. పేరు వినగానే ఏదో యాపిల్ పండులా ఉంటుందనుకుంటాం. కానీ ఇది మన జామకాయల జాతికి చెందిన స్పెషల్ పండు అన్నమాట! దీన్ని మలబార్ ప్లమ్, వాటర్ యాపిల్, జంబూ ఫలం, గులాబ్ జామ్ పండు అని చాలా పేర్లతో పిలుస్తారు.

Rose Apples: రోజ్ యాపిల్.. పేరు వినగానే ఏదో యాపిల్ పండులా ఉంటుందనుకుంటాం. కానీ ఇది మన జామకాయల జాతికి చెందిన స్పెషల్ పండు అన్నమాట! దీన్ని మలబార్ ప్లమ్, వాటర్ యాపిల్, జంబూ ఫలం, గులాబ్ జామ్ పండు అని చాలా పేర్లతో పిలుస్తారు. చూడడానికి మంచి రంగులో ఆకర్షణీయంగా ఉండి, రుచి కూడా చాలా బాగుంటుంది. అంతేకాదు, దీని వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

పేరులో యాపిల్ ఉన్నా, ఇది అచ్చం యాపిల్లా మాత్రం ఉండదు. తింటుంటే కొంచెం కరకరలాడుతూ, తీయగా, ఏదో పండు తిన్నట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత గులాబీ పువ్వుల సువాసన వస్తుంది. ఆహా.. అద్భుతంగా ఉంటుంది కదా!

రోజ్ యాపిల్ వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే:

షుగర్ కంట్రోల్: రోజ్ యాపిల్‌లో "జాంబోసిన్" అనే పదార్థం ఉంటుంది. ఇది మనం తినే ఆహారంలోని పిండి పదార్థాలు చక్కెరగా మారకుండా చేస్తుంది. దీని వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. అంతేకాదు, ఇందులో ఉండే మాలిక్ యాసిడ్ గ్లూకోజ్ వినియోగాన్ని కూడా క్రమబద్ధీకరిస్తుంది.

గుండెకు మంచిది: రోజ్ యాపిల్‌లో గుండెకు కావలసిన ఖనిజాలు చాలా ఉన్నాయి. పొటాషియం, సోడియం వంటివి కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. దీని వల్ల గుండెపోటు, బీపీ, పక్షవాతం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

రోగనిరోధక శక్తి: విటమిన్ సి, విటమిన్ ఎ రోజ్ యాపిల్‌లో పుష్కలంగా ఉంటాయి. ఇవి మన బాడీలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. సూక్ష్మజీవుల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి కూడా కాపాడతాయి. ఐరన్, కాల్షియం వంటి పోషకాలు కూడా మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

జీర్ణక్రియకు సహాయం: రోజ్ యాపిల్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. దీని గింజలు కూడా విరేచనాలు, వాంతులు వంటి కడుపు సమస్యలను కంట్రోల్ చేస్తాయి.

బరువు తగ్గడానికి: ఇందులో ఫైబర్ ఎక్కువ కాబట్టి తిన్న వెంటనే కడుపు నిండినట్టు ఉంటుంది. దీని వల్ల ఎక్కువ తినకుండా ఉంటాం. బరువు కూడా కంట్రోల్‌లో ఉంటుంది.

ఎముకలకు బలం: రోజ్ యాపిల్‌లో కాల్షియం ఉంటుంది. ఇది ఎముకల నిర్మాణానికి చాలా అవసరం. అలాగే దంతాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. మెగ్నీషియం, పొటాషియం కూడా ఎముకలకు చాలా మంచిది.

కాలేయం, కిడ్నీల శుద్ధి: రోజ్ యాపిల్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు కాలేయ సమస్యలను తగ్గిస్తాయి. పోషకాహార లోపం, రక్తహీనత వంటి వాటికి కూడా ఇది మంచిది.

క్యాన్సర్ నివారణ: రోజ్ యాపిల్‌లో ఉండే విటమిన్లు క్యాన్సర్ కణాల అభివృద్ధిని అడ్డుకుంటాయి. కాబట్టి దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

చర్మానికి ఆరోగ్యం: విటమిన్ సి యాంటీఆక్సిడెంట్‌గా పనిచేసి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుంచి కూడా కాపాడుతుంది. అందుకే రోజ్ యాపిల్ ఆకుల సారాలను చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో వాడుతారు. #SkinCare

డీహైడ్రేషన్ నుంచి రక్షణ: రోజ్ యాపిల్‌లో నీటి శాతం ఎక్కువ. ఇది మన బాడీ టెంపరేచర్‌ను కంట్రోల్ చేస్తుంది.

ఇంకా చాలా ఉపయోగాలు:

♦ గర్భధారణ సమయంలో ఐరన్, విటమిన్లు అందుతాయి.

♦ దీని గింజలు, ఆకులు జ్వరానికి మందుగా పనిచేస్తాయి.

♦ జ్ఞాపకశక్తిని పెంచుతుంది.

♦ మశూచి, కీళ్ల నొప్పులకు కూడా మంచిది.

♦ ఆకులు కండ్ల కలకను తగ్గిస్తాయి.

శరీర కణజాలాలను బాగు చేస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories